Begin typing your search above and press return to search.

బాబు వ‌ద్ద‌కు చేరిన దుర్గ‌గుడి నివేదిక‌..వాట్ నెక్ట్స్‌?

By:  Tupaki Desk   |   6 Jan 2018 6:00 PM GMT
బాబు వ‌ద్ద‌కు చేరిన దుర్గ‌గుడి నివేదిక‌..వాట్ నెక్ట్స్‌?
X
విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర‌పూజ‌లు జ‌రిపిన ఉదంతం తాలుకు వివాదం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద‌కు చేరింది. ఆలయ నియమాలకు విరుద్ధంగా సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించారని విచారణ కమిటీ నిర్ధారణ చేసింది. ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు అంతరాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో ఈవో సూర్యకుమారి విఫలమయ్యారని మధ్యంతర నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నేతృత్వంలోని విచారణ కమిటీ వాస్తవాలు వివరించింది.

దేవాల‌యంతో సంబంధం లేని వ్యక్తులు ప్రవేశించడంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. పాలనా వైఫల్యంపై దుర్గగుడి ఈవో సూర్యకుమారిని తక్షణం బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు స‌మాచారం. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. ఈవోను రిలీవ్ చేసి.. ఎంక్వైరీ కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి మాణిక్యాల రావు వివ‌రించారు. ఈవోను తప్పించడం అనేది కేవలం పరిపాలన పరమైన లోపాల నేపథ్యంలోనే అని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.

విజయవాడ సీపీ సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ దుర్గగుడిలో పూజల వ్యవహారం మీద సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. ఆలయ సమయం ముగిసిన తర్వాత ఆలయానికి సంబంధం లేని వారూ లో పలకి వెళ్లిన మాట వాస్తవమ‌ని ఆయ‌న తెలిపారు. త‌మ‌ నివేదికలో ఈ విషయాలు పొందుపరిచామ‌ని తెలిపారు. ఇంకా త‌మ విచారణ కొనసాగుతోందని ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, దుర్గగుడి ఈఓ సూర్య కుమారి మీద వేటు వేసిన ప్ర‌భుత్వం ఇంఛార్జిగా దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధకి బాధ్యతలు ఇచ్చింది.