Begin typing your search above and press return to search.

గ్రౌండ్‌ రిపోర్ట్‌ - మంగళగిరి మొనగాడు ఎవరు.?

By:  Tupaki Desk   |   19 March 2019 4:14 AM GMT
గ్రౌండ్‌ రిపోర్ట్‌ - మంగళగిరి మొనగాడు ఎవరు.?
X
అసెంబ్లీ నియోజకవర్గం - మంగళగిరి
వైసీపీ - ఆళ్ల రామకృష్ణారెడ్డి (సిట్టింగ్‌)
టీడీపీ - నారా లోకేష్‌
సీపీఐ - ముప్పాళ్ల నాగేశ్వరరావు (జనసేన మద్దతు)

మంగళగిరిలో గెలుపెవరిది

ఏపీలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లాంటిదే మంగళగిరి నియోజకవర్గం. కాకపోతే.. ఇప్పుడు ఇక్కడ నుంచే నారా లోకేష్ పోటీ చేస్తుండేసరికి అందరి కళ్లు ఇప్పుడు ఈ నియోజకవర్గంపై పడ్డాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్‌ - వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జనసేన మద్దతులో సీపీఐ అభ్యర్థిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. పోటీలో మిగిలిన వారు ఎంతమంది ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం ఆర్కే, నారా లోకేష్‌ మధ్యే

చరిత్రను ఒక్కసారి చూస్తే…

మంగళగిరి నియోజక వర్గం 1960ల్లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో చేనేత కళాకారులు ఎక్కువు. దాదాపు లక్ష ఓట్లు చేనేతల చేతుల్లోనే ఉన్నాయి. చేనేతల తర్వాత కాపు ఓట్లు ఎక్కువ. ఇక గత 35 సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవలేదు. వామపక్షాలు బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి చేనేత వర్గానికి చెందినవాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే కంటే ముందు కాండ్రు కమల, ఆంతకుముందు మురుగుడు హనుమంతరావు, అంతకముందు గోలి వీరాంజనేయులు.. ఇలా అందరూ చేనేత వర్గానికి చెందినవారే.అయితే.. క్రమక్రమంగా ఇక్కడ వామపక్షాలు తమ మద్దతు కోల్పోతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఆర్కే 12 ఓట్లమెజారిటీతో గెలుపొందారు. ఆర్కే సమీప ప్రత్యర్థి - టీడీపీ నేత గంజి చిరంజీవికి కేవలం 12 ఓట్లు తక్కువ వచ్చాయి. అయితే.. ఇక్కడ టీడీపీని కూడా తక్కవుగా అంచనా వేయలేని పరిస్థితి.

టీడీపీ పరిస్థితి ఎలా ఉంది.?

సీఆర్‌ డీఏ పరిథిలోని రాజధాని ప్రాంతం ప్రధానంగా ఎక్కువ భాగం మంగళగిరిలోనే ఉంది. విజయవాడ గుంటూరు - విజయవాడ తెనాలి మధ్య రాకపోకలను మంగళగిరి ప్రధానం. దీనికి తోడు రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా ఇదే నియోజకవర్గం కిందకు వస్తారు. వాళ్ల ఓట్లన్నీ లోకేష్‌ కు పడితే.. టీడీపీకి ఇక్కడ తిరుగు ఉండదు. అన్నింటికి మించి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధానిగా అమరావతి చేసినా.. నేషనల్‌ హైవే మంగళగిరిలోనే ఉంది. సో.. భూములు రేట్లు ఇక్కడ బాగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కూడా బాగా ఊపందుకుంది. పెద్ద పెద్ద కంపెనీలు - బీఎండబ్ల్యూ - రేంజ్‌ రోవర్‌ లాంటి కార్ల షోరూమ్‌ లు అన్నీ ఇప్పుడు మంగళగిరిలోనే ఉన్నాయి. అన్నింటికి మించి రాష్ట్ర టీడీపీ అఫీస్‌ - డీజీపీ మెయిన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ - ఎయిమ్స్‌ అన్నీ ఇప్పుడు మంగళగిరిలోనే కొలువు తీరాయి. దీనివల్ల అక్కడి ప్రజల భూములకు మంచి రేటు వచ్చంది. వీటన్నింటికి తోడు..తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అభివృద్ధి మరింతగా జరుగుతుందని.. మంగళగిరిని మరో గచ్చీబౌలి చేస్తానని లోకేష్‌ ప్రకటించాడు. దీంతో.. తమ ప్రాంత అభివృద్ధిని కాక్షించే ప్రతీ ఒక్కరూ ఇప్పుడు లోకేష్‌కే ఓటు వేసే అవకాశం ఉంది. ఇక అసలు మెయిన్‌ పాయింట్.. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అని ఏడాది ముందు నుంచే సర్వేలు చేసి.. దానికి తగ్గట్లుగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే చంద్రబాబు అల్లాటప్పాగా లోకేష్‌ కు మంగళగిరి కేటాయించడు. ఇక్కడ టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది, ఎలాంటి అనుమానాలు లేవు అని క్లారిటీ వచ్చిన తర్వాతే లోకేష్‌ పోటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఉంటాడు. సో.. కొద్దిగా సీరియస్‌ గా ప్రయత్నిస్తే మంగళగిరిలో లోకేష్‌ గెలవడం పెద్ద కష్టమేమి కాదు.

వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.?

గత ఎన్నికల్లో టీడీపీ వేవ్‌ బాగా పనిచేసింది. అలాంటి టైమ్‌ లో కూడా టీడీపీ అభ్యర్థిని ఓడించి మంగళగిరిలో విజయబావుటా ఎగరవేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. గత ఎన్నికల్లో ఆళ్ల పోటీ చేసే సమయానికి ఆయన కొత్త. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. రూ.4లకే భోజనం అందించే కార్యక్రమాన్ని మంగళగిరిలో చేపట్టారు. అన్నింటికి మించి సదావర్తి భూముల కేసులో టీడీపీకి చుక్కలు చూపించారు ఆర్కే. మొన్నటికి మొన్న డీజీపీ ఇంటి విషయంలో కూడా ఆర్కే చాలా చురుగ్గా వ్యవహరించి కోర్టు చేతిలో మొట్టికాయలు పడేలా చేశారు. దీంతో.. ఆర్కే ఇమేజ్‌ మంగళగిరిలో బాగా పెరిగింది. మరోవైపు.. కాజ - పెనుమాక లాంటి గ్రామాల్లో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ. వీళ్లంతా మొదటి నుంచి కాంగ్రెస్‌ మద్దతుదారులు. ఇప్పుడు వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. దీంతో.. వారి ఓట్లన్నీ ఆర్కేకే పడతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన మద్దతుదారుల ఓట్లతో పాటు.. చేనత - కాపు - మాల - మాదిగ ఓటర్లని కూడా ఆర్కే ప్రభావితం చేయగలిగితే..లోకేశ్‌ పై గెలుపొందడం పెద్ద కష్టమేని కాదు.

సీపీఐ పరిస్థితి ఏంటి.?

పొత్తుల్లో భాగంగా మంగళగిరి సీటు సీపీఐకి ఇచ్చింది జనసేన. ఇక్కడ నుంచి సీపీఐ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వామపక్షాల ఆధిపత్యం మంగళగిరిలో తగ్గిపోయి చాలా రోజులైంది. ఇలాంటి టైమ్‌ లో ముప్పాళ్లకు ఎన్ని ఓట్లు పడతాయి అనేది ఆసక్తికర విషయమే. అయితే.. చేనేత ఓట్లపై మాత్రం ముప్పాళ్ల కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. చేనేత ఓట్లని కచ్చితంగా చీలుస్తారు. ప్రస్తుతానికి అయితే ప్రధాన ప్రత్యర్థులైన లోకేష్‌ - ఆళ్ల ఆల్‌ రెడీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. మరి ఆర్కే మళ్లీ మంగళగిరి మొనగాడు అవుతారా - లేదా లోకేష్‌ తన జీవితంలో మొదటి గెలుపును మంగళగిరి నుంచే మొదలుపెడతారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.