Begin typing your search above and press return to search.
ఈసారి జనసేనపై.. ఇంతకు మనోజ్ మద్దతు ఎవరికో?
By: Tupaki Desk | 8 Feb 2019 6:00 PM ISTమంచు మనోజ్ ఈమద్య సినిమాల విషయాల కంటే ఎక్కువ ఇతరత్ర విషయాలతో మీడియాలో ఉంటున్నాడు. సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గించిన మంచు మనోజ్ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉన్నాడు. ప్రతి బర్నింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉండే మంచు మనోజ్ కొన్ని రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు చేస్తూ ఒక ట్వీట్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేసిన విషయం తెల్సిందే. ఆ ట్వీట్ గొడవ రెండు మూడు రోజుల పాటు కొనసాగింది.
తాజాగా మంచు మనోజ్ జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ గా ట్వీట్ చేశాడు. జనసేన పార్టీలో విద్యావంతులు మరియు మేధావులు చేరడం అభినందనీయం అని, రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వారు ఇటీవల జనసేనలో జాయిన్ అయ్యారు. మాజీ పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులు జనసేనలో చేరడం పట్ల మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ సర్ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది, విద్యావేత్తలకు మంచి స్థానం కల్పించడం వల్ల పార్టీ గౌరవాన్ని, నమ్మకాన్ని మీరు పెంచారు అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.
ఒకవైపు మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తాడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా ఒకసారి టీడీపీని మరోసారి జనసేనను వెనకేసుకు వచ్చేలా ట్వీట్స్ చేయడంతో చర్చ మొదలైంది. మనోజ్ ట్వీట్‌కు కొందరు స్పందిస్తూ జనసేనలో జాయిన్ అవ్వాలంటూ కోరగా మరి కొందరు రాజకీయాల్లోకి మీరు కూడా రావాలి అంటూ ఆహ్వానించారు. మొత్తానికి మనోజ్ వరుస ట్వీట్స్ తో ఈయన మద్దతు ఎవరికై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.