Begin typing your search above and press return to search.

ట్రై స్టేట్స్ లో నివసించే తెలుగు వారికి శుభవార్త

By:  Tupaki Desk   |   27 May 2016 5:43 PM GMT
ట్రై స్టేట్స్ లో నివసించే తెలుగు వారికి శుభవార్త
X
అమెరికాలో అతి తక్కువ కాలంలో నెం-1 గా ఎదిగిన తెలుగు ఛానల్ మన టీవి తమ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆహ్లాదకరమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

కోటి లైవ్ మ్యూజికల్ షో పేరిట న్యూజెర్సీ లో జరిగే ఈ కార్యక్రమం కళాభిమానులకు వినోధాన్ని పంచనుంది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తన ఆర్కెస్ట్రాతో కలిసి సినీ గీతాల సునామి సృష్టించబోతున్నారు.

ప్రముఖ గాయకులు సాయి ఛరణ్ - హేమచంధ్ -, శృతి - సాయిశిల్ప - శివ తదితరులు తమ స్వర మధురిమ పంచుతారు.

ఉర్రూతలూగించే పాటలు - ఫ్యాషన్ షో - డాన్సులతో పాటు ఇమిటేషన్ రాజు మిమిక్రీ షో - జబర్ధస్త్ భాస్కర్ కామెడీ షో ఇంకా మరెన్నో వినోధ భరిత కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.

ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచే అలాగే ప్రముఖ సనీ దర్శకుడు హరి శంకర్ వస్తున్నారు.

అంతే కాదండీ అందాల సినీ తారలు హంసా నందినీ - రచన - భాను శ్రీ - సియా గౌతమ్ - విమలారామన్ - మాధురి - పింకీ తమ పెర్ఫామెంన్సులతో స్టేజ్ పై తళుకు మంటారు.

మన టీవి సెకండ్ యానివర్సరీ ప్రొగ్రాం న్యూజెర్సీలోని ఉడ్ బ్రిజ్ హై స్కూల్ లో జరగనుంది.

జూన్ నాలుగు శనివారం సాయంత్రం మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సందడి సాగనుంది.

టికెట్లు కోసం www.manatv.net/tickets కు లాగాన్ అవ్వండి.

భోజనంతో కలిపి సింగిల్ టికెట్ $10, ఫ్యామిలీ టికెటు(2+2) $25 మాత్రమే..ఇంకెందుకు ఆలస్యం మన టీవి రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆనందించండి.
టికెట్లు, స్పాన్సర్ షిప్ వివరాలకు కాల్: 917-577-4989
732-543-4655
732-816-9001