Begin typing your search above and press return to search.

గిన్నిస్ రికార్డు కోసం 24 గంటల్లో 78 పబ్బుల్లో తాగాడు

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:40 AM GMT
గిన్నిస్ రికార్డు కోసం 24 గంటల్లో 78 పబ్బుల్లో తాగాడు
X
దాదాపు పాతికేళ్ల క్రితం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సాధించటం అప్పట్లో పెద్ద వార్తగా ఉండేది. ప్రాశ్చాత్య దేశాల వారు తప్పించి.. ఈ బుక్ లో పేరు సొంతం చేసుకోవటం చాలా కష్టమన్నట్లుగా ఉండేది. కానీ.. గడిచిన కొన్నేళ్లుగా.. ఈ బుక్ లోని రికార్డులను టార్గెట్ చేసిన మనోళ్లు ఇప్పటికే చాలా రికార్డుల్ని తమ పేరున రాయించేసుకున్నారు. తాజాగా నమోదైన ఈ రికార్డును చూస్తే.. కాస్తంత ప్లాన్ చేసి ట్రై చేస్తే బద్దలు కొట్టేయటం అంత కష్టమైన పని కాదన్న భావన కలుగక మానదు.

ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా? సింఫుల్ 24 గంటల వ్యవధిలో 78 పబ్బుల్లో తాగటం. అయితే.. ఇదెలా? అంటారా? చాలా సింఫుల్. ఒక్కో పబ్ లో 125 ఎంఎల్ మాత్రమే తాగటం.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పబ్బుల్ని సందర్శించుకుంటూ వెళ్లటమేనని చెబుతున్నారు. ఈ రికార్డుకోసం ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విలియర్స్ అనే వ్యక్తి లైసెన్సులు ఉన్న పబ్బుల్ని వరుస పెట్టి వెళ్లి.. 24 గంటల్లో అత్యధిక పబ్ ల్ని సందర్శించిన వ్యక్తిగా రికార్డును క్రియేట్ చేశారు.

అదే పనిగా వరుస పెట్టి ఇంత డ్రింక్ తీసుకున్న తర్వాత నడుస్తాడా? అసలు సోయి ఉంటుందా? అన్న సందేహం అక్కర్లేదు. అందుకే తన జాగ్రత్తల్నిచూసుకునేందుకు తనతో పాటుమరో ఇద్దరిని వెంట పెట్టుకొచ్చిన అతగాడు.. రికార్డును క్రియేట్ చేయటం కోసం.. ముందస్తుగా భారీ ప్లాన్ చేశారు. జీపీఎస్ సాయంతో రూట్ మ్యాప్ ను క్లియర్ గా పెట్టుకోవటమే కాదు.. ఏపబ్ కు ఎలా వెళ్లాలి? ఎంత టైంకు వెళ్లాలన్న షెడ్యూల్ ను సిద్ధం చేసుకన్నారు.

ఆ తర్వాత రికార్డు సాధనకు దిగిన అతడు..అనుకున్నట్లే 24 గంటల వ్యవధిలో 78పబ్ లను సందర్శించి సరికొత్త రికార్డును తన పేరిట రాయించుకున్నాడు. ఈ రికార్డును బ్రేక్ చేయొచ్చుకానీ.. భారీగా పబ్ లు ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవటం.. అదే పనిగా తాగే కెపాసిటీ ఉన్న వారికి మాత్రమే ఈ రికార్డును బ్రేక్ చేస్తారని చెప్పాలి. చివరిగా ఒక్క మాట ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే 24 గంటల్లో దగ్గర దగ్గర 10 లీటర్ల మేర డ్రింక్ చేయాల్సి ఉంటుంది. తొక్కలో రికార్డు కోసం బంగారం లాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి?