Begin typing your search above and press return to search.

అవంతిని.. హేమంత్ పేరెంట్స్ ను లేపేసేందుకు ప్లానింగ్?

By:  Tupaki Desk   |   29 Sept 2020 10:30 AM IST
అవంతిని.. హేమంత్ పేరెంట్స్ ను లేపేసేందుకు ప్లానింగ్?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చందానగర్ కులోన్మాద హత్యపై తాజాగా హేమంత్ సతీమణి అవంతి సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన అత్తమామల ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రోజూ రెక్కీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలోని హేమంత్ తో కలిసి ఉన్న ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల కోసం ఆదివారం తాము కారులో వెళితే.. తమ వాహనాన్ని వారు ఫాలో అయినట్లుగా ఆమె చెప్పారు.

సోమవారం తన మరిది ఇంటి నుంచి బయటకు వెళ్లినంతనే.. ఇద్దరు వ్యక్తులు అతన్ని ఫాలో అయ్యారని.. తమ ఇంటి వద్ద పోలీసులతో రక్షణ కల్పించాలన్న ఆమె.. హత్య చేసిన లక్ష్మారెడ్డి ఇంటి వద్ద పోలీసుల్ని ఏర్పాటు చేయటం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన ప్రాణాలు పోయినా న్యాయపోరాటం ఆపేది లేదని పేర్కొన్న ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు అంశాల్ని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ ను కలిసి వివరిస్తానని ఆమె చెబుతున్నారు.

తన భర్తను చంపిన లక్ష్మారెడ్డి వాళ్లను తన తల్లిదండ్రులుగా సంబోధించటం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్న ఆమె.. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల సంఖ్య 18 నుంచి 21కు పెరగటం గమనార్హం. తాజాగా అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి.. సందీప్ లతో పాటు మరో వ్యక్తినీ నిందితులుగా చేర్చారు. ఇక.. జైల్లో ఉన్న నిందితులందరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.