Begin typing your search above and press return to search.

సీఎం మీదకు చాక్లెట్లు విసిరి అరెస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   22 Feb 2016 4:11 AM GMT
సీఎం మీదకు చాక్లెట్లు విసిరి అరెస్ట్ అయ్యాడు
X
కొన్ని పనులు అస్సలు చేయకూడదు. నిబంధనల్ని ఉల్లంఘించేలా ఉంటే కొన్న పనుల కారణంగా లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి చేష్ట అతన్ని పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లేలా చేయటమే కాదు.. అరెస్ట్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ప్రముఖులపై ఆగ్రహంతో చెప్పులు విసరటం.. ఇంకు పోసేందుకు ప్రయత్నాలు చేయటం లాంటివి మామూలే. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి మీద ఒక వ్యక్తి కాగితం ఉండ విసిరాడు. అయితే.. ఆ ఉండలో చాక్లెట్లు ఉండటం గమనార్హం.

ఏదైనా అంశంపై ఆగ్రహంతో చెప్పులు విసిరే దానికి భిన్నంగా.. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రసంగిస్తుండగా.. ఒక వ్యక్తి చాక్లెట్లతో ఉన్న ఒక కాగితం ఉండను విసిరారు. ఇది సీఎంకు నేరుగా తాకకుండా.. ఆయనకు కాస్త దూరంలో పడింది. వెంటనే రియాక్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ ఉండను తెరిచి చూస్తే అందులో చాక్లెట్లు ఉన్నాయి. అయితే.. చాక్లెట్లు ఉన్న కాగితం ఉండను విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకిలా చేశాడన్న విషయం మీద ఆరా తీస్తున్నారు.