Begin typing your search above and press return to search.
ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన హత్యకు తానే సుపారీ ...!
By: Tupaki Desk | 16 Jun 2020 3:00 PM ISTఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎవరు ఊహించని పనిచేసాడు ఓ వ్యాపారి. తన హత్యకు ప్లాన్ చేసి తనను తాను హత్య చేయించుకోడానికి ముగ్గురు వ్యక్తులకు సుఫారీ ఇచ్చాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎక్స్ టెన్షన్ ప్రాంతానికి చెందిన షాను బన్సాల్ అనే మహిళ తన భర్త కన్పించడం లేదంటూ జూన్ 10వ తేదీన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.
ఢిల్లీ శివారులోని రన్‌హౌలా ప్రాంతంలో గౌరవ్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా గౌరవ్ మొబైల్ ను పోలీసులు పరిశీలించారు. అందులో దొరికిన ఒక సంభాషణ విని పోలీసులు షాకయ్యారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. గౌరవ్ తనను తాను హత్య చేయించేందుకు ఓ మైనర్ బాలుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సంభాషణ ప్రకారం.. జూన్ 9న తన ఇంటి నుంచి గౌరవ్ ముందు వేసుకన్న ప్రణాళిక ప్రకారం ప్రజారవాణ సదుపాయాల్లోనే రన్‌హౌలా ప్రాంతానికి చేరుకున్నాడు.
అయితే గౌరవ్ అంతకుముందే తన హత్య కోసం సుపారీ ఇచ్చిన వ్యక్తులకు తన ఫోన్ ద్వారా ఫోటోను పంపించాడు. ఈ క్రమంలో గౌరవ్ రన్‌హౌలా ప్రాంతానికి చేరుకోగానే.. నిందితులు అతడి చేతులను వెనక్కి విరిచి కట్టేశారు. అనంతరం ఓ చెట్టుకు ఉరి వేశారు. దీంతో గౌరవ్ ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు సంబంధించి ఇప్పటికే మైనర్ బాలుడితో సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. గౌరవ్ కు రావాల్సిన బీమా మొత్తం ఎంత, సుపారి కింద ఎంతిచ్చాడు లాంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు.