Begin typing your search above and press return to search.

విగ్గు వేసి హీరోల తయారై అమ్మాయిలకు వల: మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి..!

By:  Tupaki Desk   |   12 Jun 2020 3:30 PM GMT
విగ్గు వేసి హీరోల తయారై అమ్మాయిలకు వల: మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి..!
X
మనిషి ఎలాగున్నా అమ్మాయిలు కనిపిస్తే చాలు నవ యవ్వనుడిగా కనిపిస్తాడు. లేని అందాన్ని తెచ్చి పెట్టుకుంటారు. అందంగా కనిపించి అమ్మాయిలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తున్న ఓ వ్యక్తి ఈ విధంగా చేసి అడ్డంగా బుక్కయాడు. పోలీసులకు చిక్కి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. టీచర్ గా విద్యార్థులకు బుద్ధులు చెప్పాల్సిన వ్యక్తి ఇలా దారితప్పాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది.

అతనికి బట్టతల ఉన్నా విగ్గు ధరించి షో చేస్తాడు.. అందంగా ముస్తాబై ఫేస్‌బుక్‌లో యువతులకు వల విసురుతాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతుల, మహిళలతో పరిచయం పెంచుకుని వారి ఫొటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి వాటితో వారిని బెదిరింపులకు పాల్పడతాడు. వారిని డిమాండ్ చేసి వారి నుంచి డబ్బు, బంగారం దోచేస్తాడు.

అతడే కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన రాజ్‌కుమార్‌. ఇతనికి భార్య, పిల్లలు ఉండగా.. కొంతకాలంగా రాజుపాళెంలో ప్రైవేటు పాఠశాల నడుపుతున్నాడు. వేర్వేరు మారుపేర్లతో ఫేస్‌బుక్‌లో అకౌంట్లు నడుపుతూ అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఈ క్రమంలో పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉన్న ఓ మహిళను కారులో తీసుకెళ్లాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని ఒక గ్రామానికి తీసుకెళ్లి ఆమెను నిర్బంధించాడు. ఆమెను తీవ్రంగా హింసించాడు. అయితే ఈ విషయం తెలియని కుటుంబసభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో జూన్ 1వ తేదీన నిర్బంధిచిన ప్రాంతం నుంచి బాధితురాలు ఎలాగోలా తప్పించుకుంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. వెంటనే ప్రొద్దుటూరు పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే విచారణలో రాజ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో పలువురిని మోసగించి డబ్బు, బంగారం దోచుకున్నట్లుగా తేలింది. దీంతో నిందితుడిపై వివిధ రాష్ట్రాల్లో 12 కేసులు నమోదయ్యాయి. ఇతడి వలలో చాలా మంది ఆడవాళ్లు చిక్కినట్లు తెలుస్తోంది.