Begin typing your search above and press return to search.
ఏడోసారి ప్లాస్మా దానం.. ఈ కరోనా హీరోకు అవమానాలు
By: Tupaki Desk | 30 July 2020 3:20 PM ISTకరోనా ఇప్పుడు దేశాన్ని కప్పేసింది. మందే లేని ఈ మహమ్మారి నుంచి ప్రాణాపాయ దశలో కాపాడేది కేవలం ‘ప్లాస్మా’నే.. కరోనా నుంచి బయటపడిన వారు దానం చేసే ఈ ప్లాస్మా కరోనా చికిత్సలో ఎంతో కీలకమైన వనరు.
అయితే కరోనా నుంచి కోలుకున్నాక ఎవరూ ప్లాస్మా దానానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ తబ్రేజ్ ఖాన్.. కరోనా నుంచి కోలుకొని ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. 7 సార్లు ప్లాస్మా దానం చేసి అందరికీ స్ఫూర్తినిస్తున్నాడు.
ఈ 36 ఏళ్ల తబ్రేజ్ ఇప్పటివరకు 12మంది ప్రాణాలు కాపాడాడు. అందరినీ ముందుకు రావాలని కోరుతున్నాడు. ఇప్పుడు ప్లాస్మా దానంలో తబ్రేజ్ రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు.
గత మార్చిలో తబ్రేజ్ కు కరోనా సోకింది. జహంగీర్ పూర్ కు చెందిన ఇతడు ఏప్రిల్ 5న కరోనా నుంచి కోలుకున్నాడు. ఏప్రిల్ 20న తొలిసారి ప్లాస్మా దానం చేశాడు. ఇక చాలా మంది సీరియస్ రోగుల కుటుంబ సభ్యులు వచ్చి వేడుకుంటే ప్లాస్మా దానం చేశానని వివరించాడు.
అయితే తనను ముస్లిం అని.. కరోనా వ్యాపింపచేస్తున్నాని కొందరు ఆరోపిస్తున్నారని తబ్రేజ్ వాపోతున్నాడు. తబ్లిగీ జమాత్ తో అంటగట్టి వేధిస్తున్నారని వాపోయాడు. తాను ఇచ్చిన ఏడు ప్లాస్మా దానాల్లో ఆరు హిందూ కుటుంబాలకేనని..మతం పేరిట తనను దూరం పెట్టవద్దని స్థానికులను కోరుతున్నాడు.