Begin typing your search above and press return to search.
ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగంలో వ్యక్తి మరణం
By: Tupaki Desk | 22 Oct 2020 2:39 PM ISTప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. దాదాపు వందకు పైగా పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే రెండు.. మూడు దశల్లో ప్రయోగాలు సాగి.. వడివడిగా వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలో ఎంతమంది వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నా.. టాప్ ఐదు సంస్థల ప్రయోగాలపై ఆశలు పెట్టుకున్నారు. ఆ కోవకే చెందుతుంది ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా సంస్థలు తయారుచేస్తున్న వ్యాక్సిన్.
దీనిపై పెద్ద ఎత్తున సానుకూలత నెలకొంది. ఇదిలా ఉంటే.. మొదటి..రెండో దశ పరీక్షల వేళలో కొద్దిరోజుల క్రితం బ్రిటన్ కు చెందిన వాలంటీరు ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరిశోధనల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ బ్రెజిల్.. బ్రిటన్ లలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. మూడోదశ పరీక్షల్లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా చెబుతున్నారు.
అయితే.. సదరు వ్యక్తి మరణానికి వ్యాక్సిన్ కారణమా? లేక.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వ్యాక్సిన్ వేయించుకొని మృతి చెందిన వ్యక్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు తమకు అందినట్లుగా బ్రెజిట్ చెబుతోంది. అయితే.. అతడి మరణానికి కారణం ఫలానా అన్నది తేలనప్పటికీ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆక్స్ ఫర్డ్.. వ్యాక్సిన్ ఫలితం ఇలా ఉండటం ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. అయితే.. దీనిపై తుది నివేదిక ఏం రానుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.