Begin typing your search above and press return to search.
బెంగళూరు అల్లర్ల ప్రధాన నిందుతుడిని సినీపక్కీ లో అరెస్ట్ చేసిన పోలీసులు!
By: Tupaki Desk | 11 Sept 2020 2:40 PM ISTబెంగళూరు లో అల్లర్లు జరగడానికి, ఎమ్మెల్యే హౌస్ , కారు తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడాకి కారణం అయిన ప్రధాన నిందితుడు, కింగ్ పిన్ ముజాహిద్ అనే వ్యక్తిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ అల్లర్ల తర్వాత ఇతర ప్రాంతాల్లో తప్పించుకుని తిరుగుతున్న వాటర్ మన్, బ్యాట్స్ మన్, ఫైర్ మన్ అవతారాలు ఎత్తిన ముజాహిద్ పోలీసులకు సినిమా పక్కీలో చిక్కిపోయాడు. నగరంలో డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ బ్యూటీల కేసుల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిజీగా ఉన్నారని, తనను ఎవ్వరూ ఏమి చెయ్యలేరని దైర్యంతో ముజాహిద్ బంధువల ఇంటికి వెళ్లి బిర్యానీ తింటున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా ముందుకువచ్చి నిలబడ్డారు. దీనితో పారిపోవడానికి కూడా మరో అవకాశం లేకుండాపోయింది.
బెంగళూరులో డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో ఆగస్టు 11వ తేదీ అర్దరాత్రి పులకేశీనగర నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి అగ్గి పెట్టారు. అదే సమయంలో డీజే హళ్ళి, కేజీ హళ్ళి ప్రాంతాల్లో అంబులెన్స్ లు, పోలీసు వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలతో పాటు అనేక మంది ఆస్తులు నాశనం చేశారు. కరోనా కాలంలో కొందరు అల్లరిమూకలకు పోయాలం కావడంతో పెద్ద ఎత్తున హింస జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గం దేవుడిని కించపరిచారిచి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడని , ఈ అల్లర్లకి తెగ బడ్డారు. ఇక , ఓ వర్గంలోని స్థానికులను ఒక్కటి చేసి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటి దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆయన ఇంటికి నిప్పంటించిన ఫైర్ మన్ గా ముజాహిద్ కింగ్ పిన్ అయ్యాడని పోలీసులు అంటున్నారు. దానికి తగ్గ ఆధారాలు కూడా పోలీసులకి చిక్కాయి.
స్థానికంగా , నివాసం ఉంటున్న ఓ వర్గం వారిని ముజాహిద్ రెచ్చగొట్టి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించాడని పోలీసులు అంటున్నారు. తన ఇల్లు నాశనం కావడానికి ముజాహిద్ ప్రధాన కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సైతం పోలీసు అధికారుల ముందు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వర్గం వారిని ముజాహిద్ రెచ్చగొట్టి ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి నిప్పంటించాడని పోలీసులు అంటున్నారు. తన ఇల్లు నాశనం కావడానికి ముజాహిద్ ప్రధాన కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సైతం పోలీసు అధికారుల ముందు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు
ఆగస్టు 11వ తేదీ బెంగళూరులో అల్లర్లు జరిగిన తరువాత ముజాహిద్ పరారైనాడు. తరువాత బెంగళూరు గ్రామీణ, కోలారు. చిక్కబళ్లాపుర, కేజీఎఫ్, ముళబాగిల్, రామనగరలోని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ముజాహిద్ తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ముజాహిద్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిజీబిజీగా ఉన్నారని, తనను పట్టుకునే ఓపిక వాళ్లకు లేదని ముజాహిద్ పొరపాటుపడ్డాడు.బెంగళూరు చేరుకున్న ముజాహిద్ చామరాజపేటలోని బంధువుల ఇంటిలో హ్యాపీగా బిర్యానీ తింటున్న సమయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. హ్యాండ్సప్ అంటూ పోలీసులు సినిమా స్టైల్లో అతన్ని చుట్టుముట్టడంతో ఇంకేం చేయలేకపోయాడు. దీనితో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.