Begin typing your search above and press return to search.

నగ్నంగా కౌన్సిలర్‌‌‌ ఆన్‌లైన్ మీటింగ్ .. అధికారులు ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   8 July 2020 11:30 PM GMT
నగ్నంగా కౌన్సిలర్‌‌‌  ఆన్‌లైన్ మీటింగ్ .. అధికారులు ఏంచేశారంటే ?
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ఇంటి నుండి విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే , ఏదైనా సమావేశం కావాల్సి వస్తే అందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నే సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజులు కిందట ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్‌ లో మూత్ర విసర్జన చేస్తూ వీడియో మీటింగులో పాల్గొంది. వీడియో ఆప్షన్ ఆఫ్ చేయడం మరిచిపోయి అడ్డంగా బుక్కయ్యింది.

తాజాగా అలాంటి ఘటన ఈ సారి స్పెయిన్‌ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి స్నానం చేస్తూ నగ్నంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. టోర్రెల వేగా కమ్యూనిటీ పార్ట్ టైమ్ కౌన్సిలర్ గా పనిచేస్తున్న బెర్నాడో బుస్టిల్లా.. ఇటీవలే ఒక ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఈ మీటింగ్ టీవీ లో కూడా ప్రసారమైంది. అయితే తనకు స్నానం చేయడానికి టైం సరిపోవడం లేదని లాప్టాప్ తీసుకెళ్లి బాత్రూంలో స్నానం చేస్తు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. బెర్నాడో తన ల్యాప్‌ టాప్‌ లో వీడియోను ఆఫ్ చేయడం మరిచిపోవడంతో.. అతడి నగ్నవతారాన్ని ప్రజలు కూడా చూడాల్సి వచ్చింది. అతడిని అలా చూసేసరికి తోటి కౌన్సిలర్లు అధికారులు షాకయ్యారు. ఆ మీటింగ్ పూర్తయిన వెంటనే అతడు తన కూతురిని బయటకు తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో , ఆ మీటింగ్ అయ్యేలోపు స్నానం చేసి సిద్ధంగా ఉండాలని చేసాడు.

ఇది చూసిన అధికారులు వెంటనే అతనికి కాల్ చేసినప్పటికీ బాత్రూం లో ఉండడంతో ఫోన్ సౌండ్ వినిపించలేదు. చివరికి మేయర్ చేసేదేమీలేక మీటింగ్ ని ఆపేశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత బెర్నాడో ఎంతగానో ఫీల్ అయి పోయారు. మీటింగ్‌లో క్వశ్చన్ ఆన్సర్లను మిస్ కాకుండా వినేందుకు ల్యాప్‌టాప్‌ను బాత్రూమ్ ‌లోకి తీసుకెళ్లాను. ఇది నేను క్రిమినల్, అనైతిక లేదా అగౌరవకర చర్యగా భావించడం లేదు. అది టెక్నికల్ సమస్య అని తెలిపాడు. అయితే, బెర్నాడో పార్టీ మాత్రం దీనిపై సీరియస్ ‌గా స్పందించింది. దీనికి బాధ్యత వహిస్తూ అతడిని రాజీనామా చేయాలని కోరింది.