Begin typing your search above and press return to search.

జైలుకు వెళ్లాల‌ని ఉంద‌ని, ప్రధాని మోడీని హత్యచేస్తానన్న వ్యక్తి!

By:  Tupaki Desk   |   4 Jun 2021 10:00 PM IST
జైలుకు వెళ్లాల‌ని ఉంద‌ని, ప్రధాని మోడీని హత్యచేస్తానన్న వ్యక్తి!
X
పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరించిన 22 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసిన స‌ద‌రు వ్య‌క్తి.. మోడీని చంపేస్తాన‌ని చెప్పాడు. దీంతో.. వెంట‌నే అల‌ర్ట్ అయిన‌ పోలీసులు సెల్ ఫోన్ సిగ్న‌ల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతానికి చెందిన స‌ల్మాన్ అలియాస్ అర్మాన్ గా పోలీసులు నిర్ధారించారు. అయితే.. అరెస్టు చేసిన స‌మ‌యంలో అత‌డు డ్ర‌గ్స్ తీసుకుని ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఇలా ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నించ‌గా.. త‌న‌కు జైలుకు వెళ్లాల‌ని ఉంద‌ని, అందుకే.. ప్ర‌ధానిని చంపేస్తాన‌ని పోలీసుల‌కు చెప్పాడ‌ట‌.

కాగా.. డ్ర‌గ్స్ కు బానిసైన స‌ల్మాన్‌.. గ‌తంలో హత్య కేసులో జువైన‌ల్ హోమ్ కు వెళ్లిరావ‌డం గ‌మ‌నార్హం. 2018 లో అత‌ను ఈ కేసులో జైలుకు వెళ్లిన‌ట్టు స‌మాచారం. ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు.. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన‌ సమయంలో డ్రగ్స్ ప్రభావంతో ఉన్న‌ట్టు నిర్ధారించారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో అతన్ని తండ్రి కూడా తిట్టాడట‌.

గ‌తంలోనూ నేర చ‌రిత్ర ఉండ‌డంతో పోలీసులు లోతుగా విచారిస్తున్న‌ట్టు స‌మాచారం. అదే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరోతోనూ విచారించే అవ‌కాశం ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.