Begin typing your search above and press return to search.

పాతబస్తీలో ఎంత దారుణం జరిగిదంటే..

By:  Tupaki Desk   |   14 March 2017 10:05 AM IST
పాతబస్తీలో ఎంత దారుణం జరిగిదంటే..
X
మాట వరసకు సైతం మనిషిగా అనుకోలేని వ్యవహారమిది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతాన్ని చూస్తే..షాక్ తినాల్సిందే. ఇంత దారుణమా?అని అనుకోకుండా ఉండలేం. మనిషిలోని పైశాచికత్వం పీక్స్ వెళ్లిన ఈ వైనంలోసైతం పెళ్లాన్ని నానా రకాలుగా వేధించటమే కాదు..ఫ్రెండ్ చేత రేప్ చేయించిన రాక్షసత్వం కనిపిస్తుంది. వీడే ఇంత దుర్మార్గుడనుకుంటే.. అత్త.. ఆడపడుచు తీరు మరీ దుర్మార్గంగా చెప్పాలి. ఉన్నత కుటుంబాల్లో ఇలాంటివి కామన్ అంటూ సర్దుకుపోవాలంటూ వారు చెప్పినట్లుగా బాధితురాలి మాటలు వింటే ఒళ్లు మండిపోవటమే కాదు.. వీళ్లు అసలు మనుషులేనా? మానవత్వం అనేది ఉందా? అనిపించక మానదు.

హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించిన ఈవ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పాతబస్తీకి చెందిన 26 ఏళ్ల సనాఫాతిమాకు మాదన్నపేట సాలార్ నగర్ కు చెందిన మహ్మద్ సలీముద్దీన్ కు ఏడాది కిందట పెళ్లి అయ్యింది. ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతగాడు.. వీడియో కాలింగ్ చేసి.. నగ్నంగా మాట్లాడాలని కోరేవాడు. ఎంతవద్దన్నా ఊరుకునేవాడు కాదు. అంతేనా.. తాను రికార్డు చేసిన నగ్నవీడియోలను స్నేహితుడికి షేర్ చేసి.. అతడికి తన భార్యను బలిచ్చాడు. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగించి.. ఫ్రెండ్ రేప్ చేసేలా చేశాడు.

జరిగిన దారుణం గురించి అత్త.. ఆడబడుచులకు చెబితే.. ఉన్నత కుటుంబాల్లో ఇలాంటివి మామూలేనని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పటం గమనార్హం. అంతేనా..మంచి పిల్లలు పుడతారంటూ.. తాను బాగా నమ్మే బాబాతోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని.. అప్పుడే మంచి పిల్లలు పుడతారంటూ ఒత్తిడి తేవటం మొదలెట్టాడు. దీంతో.. భర్త విపరీత ధోరణిని తట్టుకోలేని బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తను..అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేప్ చేసిన భర్త ఫ్రెండ్ చాంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతగాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక.. భర్త నమ్మిన బాబాను సైతం విచారించే ప్రయత్నం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/