Begin typing your search above and press return to search.

టీడీపీ హయాంలో లక్షల్లో నొక్కేసిన లేడీ దీప్తి అరెస్ట్!

By:  Tupaki Desk   |   10 Feb 2020 6:30 PM IST
టీడీపీ హయాంలో లక్షల్లో నొక్కేసిన లేడీ దీప్తి అరెస్ట్!
X
టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తి మోసాలు అప్ప‌ట్లో గుంటూరులో హాట్ టాపిక్‌ గా మారాయి. బోడుపాలెంకు చెందిన దీప్తి టీడీపీ పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని - ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని - కాంట్రాక్టు బిల్లులు ఇప్పిస్తాన‌ని చెప్పి ప‌లువురిని మోసం చేసిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. విలాసవంతమైన జీవితానికి బాగా , అలవాటుపడి ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగ యువతకి వల వేసి - ఇలాంటి మోసాలకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇలాంటి మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఆమెను పెదకాకానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 11 రోజుల రిమాండ్‌ విధించారు. టీడీపీ హయంలో సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డులతో బయట తిరుగుతూ హల్ చల్ చేసింది. మంత్రుల శాఖల కార్యాలయాల్లోకి వెళ్లి వస్తూ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ ఉద్యోగాల పేరుతో వారి నుంచి లక్షల్లో డబ్బు లాగేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందిన వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఐదుగురికి ఏపీ జెన్‌ కోలో ఉద్యోగం ఇప్పించేలా దీప్తితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా గతేడాది ఏప్రిల్‌ 15న ఆమెకు రూ.12.50 లక్షలు చెల్లించాడు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి దిలీప్ - మోహనరావు కూడా ఉద్యోగాల నిమిత్తం ఆమెకు రూ.6.50 లక్షలు చెల్లించారు.

డబ్బు తీసుకోని రోజులు గడుస్తున్నా కూడా ఉద్యోగం ఊసే లేకపోవడం - దీప్తి ని అడిగితే సరిగా ఆమె స్పందించకపోవడంతో మోసపోయామని గతేడాది అక్టోబర్‌ 15న పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీనితో అప్పటినుండి ఆమె పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెని నిన్న హైదరాబాద్‌ లో అరెస్ట్ చేశారు.