Begin typing your search above and press return to search.

దీదీ రాష్ట్రంలో వారి కోసం సపరేట్ బాత్రూమ్స్

By:  Tupaki Desk   |   8 July 2016 8:44 AM GMT
దీదీ రాష్ట్రంలో వారి కోసం సపరేట్ బాత్రూమ్స్
X
ప్లేస్ ఏదైనా కానీ.. బాత్రూమ్స్ ఇప్పటివరకూ రెండే రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి పురుషులకైతే.. రెండోది స్త్రీలకు. మరి.. హిజ్రాల మాటేమిటన్నది ఒక ప్రశ్న. దీనికి సూటిగా సమాధానం చెప్పేవారు కనిపించరు. అయితే.. ఈ ఇబ్బందికి సంబంధించి దేశంలో మరే రాష్ట్రం స్పందించనప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం రియాక్ట్ అయ్యారు.

దేశంలో మరెక్కడా లేనట్లుగా హిజ్రాలకు సైతం ప్రత్యేకంగా బాత్రూంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని యూనివర్సిటీల్లో.. కాలేజీల్లో ఈ ప్రత్యేక బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లోనే ఈ ఏర్పాటు చేయాంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల తమకు ఇప్పటివరకూ ఎదురైన ఇబ్బందులు తప్పుతాయంటూ.. హిజ్రాలు కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం.. ఇలాంటి వాటి వల్ల తమను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని హిజ్రాలు వాపోతున్నారు. ఏది ఏమైనా దీదీ.. తన తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెర తీశారని చెప్పొచ్చు.