Begin typing your search above and press return to search.

మమత ప్రతీకారం: సువేందు అధికారిపై దొంగతనం కేసు

By:  Tupaki Desk   |   6 Jun 2021 2:00 PM IST
మమత ప్రతీకారం: సువేందు అధికారిపై దొంగతనం కేసు
X
బెంగాల్ ఎన్నికల్లో మమత బెనార్జీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. కానీ తన ప్రత్యర్తి అయిన సువేందు అధికారి చేతిలో మాత్రం నందిగ్రాంలో ఓడిపోయారు. తొడగొట్టిన ప్రత్యర్థిని పడగొట్టలేకపోయారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అండదండలతో రెచ్చిపోయినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సువేందు ఏకంగా మమతను ఓడించి ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎదిగారు.

ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టగా మారిన బెంగాల్లో తాజాగా సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ప్రతీకారాన్ని మొదలుపెట్టారు. తన ప్రత్యర్థి అయిన సువేందు అధికారిని టార్గెట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా అతడి సోదరుడు సౌమేందు అధికారిపై దొంగతనం కేసు నమోదైంది. సువేందు తండ్రి శిశిర్ అధికారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కంతి ఎంపీ సెగ్మెంట్ లో కంతి మున్సిపాలిటీ కార్యాలయంలో లక్షల విలువైన సామగ్రిని దొంగతనం చేసినట్టు సువేందు సోదరులపై కేసు నమోదైంది. గతంలో కంతి మున్సిపాలిటీ చైర్మన్ గా సౌమేందు వ్యవహరించారు.

యాస్ తుఫాన్ బాధితుల కోసం పంచాల్సిన రిలీఫ్ సామగ్రిని సువేందు, సౌమేందు అధికారిల ఆదేశాల మేరకు వారి అనుచరులు మే 29న కంతి మున్సిపాల్ గౌడౌన్ నుంచి ఎత్తికెళ్లినట్టు కేసు నమోదు చేశారు. ఈ సామగ్రి విలువ లక్షల్లోనే ుంటుందని తేల్చారు. కంతి మున్సిపల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే టీఎంసీపై బీజేపీ నేతలు ఇదే యాస్ తుఫాన్ కార్యక్రమాల్లో అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. కేంద్రం ఇచ్చిన 1000 కోట్ల సాయాన్ని , ఇతర సామాగ్రిని సీఎం మమత దారిమళ్లించారంటూ ప్రతిపక్ష నేత సువేందు ఆరోపించారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని మమత తన ప్రత్యర్థి సువేందుపై ప్రయోగించారు.సువేందు ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని కేసుల్లోనూ సువేందును బుక్ చేయడానికి మమతా బెనర్జీ తవ్వుతున్నారని టాక్ నడుస్తోంది.