Begin typing your search above and press return to search.

మోడీ నోట్ల రద్దు దెబ్బకు విపక్షాలు ఏకమయ్యాయి

By:  Tupaki Desk   |   14 Nov 2016 5:13 PM GMT
మోడీ నోట్ల రద్దు దెబ్బకు విపక్షాలు ఏకమయ్యాయి
X
ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉండే విపక్షాలు ఇప్పుడు ఏకమయ్యాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కమ్యూనిస్టు నేతలతో రాసుకుపూసుకు తిరగటాన్ని ఎవరైనా కల కనగలరా? సైద్ధాంతికంగా ఏ మాత్రం పొసగని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఏకం కావటమే కాదు.. మోడీ సర్కారు మీద యుద్ధం ప్రకటించేందుకు రెఢీ అంటున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నడిపిన మంత్రాంగంతో ఊహించని రీతిలో విపక్షాలు ఏకమయ్యాయి.

మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో కాంగ్రెస్.. టీఎంసీ.. ఆర్జేడీ.. జేడీయూ.. జెఎంఎం.. సీపీఐ.. సీపీఎం పార్టీల నేతలు ఒక్క చోటికి చేరారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్నఅవకాశాల్ని చర్చించటమే కాదు.. తగిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు.

మోడీ అంటేనే మంటెక్కిపోయేలా వ్యవహరించే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు మంగళవారం భేటీ కానున్నారు. అనంతరం.. విపక్షాలన్నీ మరోసారి భేటీ అయి.. తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లగా తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయంపై మోడీ సర్కారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పార్లమెంటులోనూ.. బయటా పోరాడాలని నిర్ణయించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు తన ప్రాణం పోయినా నోట్ల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని మోడీ తేల్చి చెబుతున్న వేళ.. విపక్షాలు సైతం పంతంగా ఇదే అంశంపై మోడీ సర్కారు వెనక్కి తగ్గాలని డిసైడ్ కావటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/