Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను ఓవ‌ర్ టేక్ చేసిన మ‌మ‌తాబెన‌ర్జీ.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్యూహం రెడీ!

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:43 PM GMT
కేసీఆర్‌ను ఓవ‌ర్ టేక్ చేసిన మ‌మ‌తాబెన‌ర్జీ.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల వ్యూహం రెడీ!
X
జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ లేకుండానే.. బెంగాల్ సీఎం మ‌మ‌త చ‌క్రం తిప్పారు. బీజేపీకి వ్య‌తిరేక కూట‌మిగా.. ఏర్పడి రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు 17 పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని 17 పార్టీల నేతలతో తీర్మానం చేయించారు.

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో.. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. "రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపా లని విపక్ష పార్టీల నేతలు తీర్మానం చేశారు.

భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా సేవ చేయగల అభ్యర్థి, ప్రజాస్వామ్యానికి, దేశ సామాజిక నిర్మాణానికి మరింత నష్టం కలిగించుకండా మోడీ ప్రభుత్వాన్ని ఆపగలిగే వ్యక్తిని నిలపాలని నిర్ణయించారు " అని ఈ సంద‌ర్భంగా మ‌మ‌త తెలిపారు

ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఉమ్మ‌డిగా బ‌రిలో నిలిచే అభ్యర్థికి ప్రతి పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. సమావేశానికి హాజరుకాని వారిని సైతం సంప్రదిస్తామ ని, ఇది ఒక మంచి ఆరంభమని ప‌రోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి మ‌మ‌త వ్యాఖ్యానించారు. కొన్ని నెలల తర్వాత అంతా కలిసి సమావేశమయ్యామని, భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు జరుగుతాయన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ప్రత్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపై చర్చించేం దుకు.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో దిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి.

ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి సహా.. దేశంలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్షాలు ఐక్యంగా కేంద్రాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలు చర్చించారు. ఈ భేటీకి కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే సహా మొత్తం 17 పార్టీల నేతలు హాజరయ్యారు. అదేస‌మ‌యంలో ఢిల్లీ పాల‌క ప‌క్షం ఆప్, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి.