Begin typing your search above and press return to search.

కేసీఆర్‌...బీజేపీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌!

By:  Tupaki Desk   |   18 Dec 2016 7:47 AM GMT
కేసీఆర్‌...బీజేపీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌!
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ - మండలిలో పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ చేసిన ప్రసంగంపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కేసీఆర్ ప్ర‌సంగం ప్రజలను అవమానించేలా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి విమ‌ర్శించారు. బీజేపీకి బ్రాండ్‌ అంబాసిడర్ వ‌లే కేసీఆర్‌ మారిపోయారని విమ‌ర్శంచారు. బీజేపీ-టీఆర్‌ ఎస్‌ మధ్య కుదిరిన చీకటి ఒప్పందం కేసీఆర్ ప్రసంగంతో మరొసారి బయటపడిందని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీతో కేసీఆర్‌ కలిసిపోయారడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని మ‌ల్లు ర‌వి ప్రశ్నించారు.

కేసీఆర్ త‌నవ్య‌క్తిగత లావాదేవీలు చక్కదిద్దుకున్న తర్వాతనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీని నిర్ణయాన్ని సమర్థించడం మొదలు పెట్టారని మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన‌ మధ్యప్రదేశ్‌ - రాజస్థాన్‌ - చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా కేసీఆర్‌ నోట్ల రద్దును సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను చెప్పకుండా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్‌ తాపత్రాయ పడుతున్నారన్నారు. ఈ రకంగా మాట్లాడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయని మ‌ల్లు ర‌వి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు నిబంధ‌నల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌ రావుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించినట్టు తెలిసింది.అసెంబ్లీలో వెల్‌లోకి వచ్చారంటూ కాం గ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేసిన సందర్భంగా వెల్‌ లోకి పోని కాంగ్రెస్‌ సభ్యు డు మల్లు భట్టి విక్రమార్కను సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే సభను తప్పుదొవ పట్టించిన హరీశ్‌ రావుపై హ‌క్కుల ఉల్లంఘ‌న‌ నోటీసు ఇవ్వాల‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/