Begin typing your search above and press return to search.

శుభవార్త ..త్వరలో మాల్స్ , సెలూన్స్ ఓపెన్ ..కానీ !

By:  Tupaki Desk   |   14 May 2020 8:10 AM GMT
శుభవార్త ..త్వరలో మాల్స్ , సెలూన్స్ ఓపెన్ ..కానీ !
X
దేశంలో మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కూడా ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు కదా రోజురోజుకి పెరిగిపోతుంది. ఇక కేంద్రం విధించిన మూడో దశ లాక్ డౌన్ మే 17 తో ముగియబోతుంది ..ఆ తరువాత లాక్ డౌన్ 4. 0 ఉంటుంది అని కేంద్రం ఇప్పటికే ఓక స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. అయితే , దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భారీ సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే అందరూ కూడా కొన్ని గైడ్‌ లైన్స్ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లను మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా మూసి వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాలు కొన్ని పరిమితులతో బార్బర్ షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ అవుతాయని, కానీ కొన్ని గైడ్ ‌లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుందని తాజాగా మీడియా సమావేశంలో నితిన్ గడ్కరీ తెలిపారు.

ఈ వైరస్ తో మనం జీవించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇంట్లో లేదా ఆఫీస్ లో అడుగు పెట్టే సమయంలో శానిటైజర్ వినియోగించడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మన జీవితంలో భాగం కావాలని అన్నారు. కొత్త నిబంధనలతో నాలుగో విడత లాక్ డౌన్ డిఫరెంట్ గా ఉండనుందని చెప్పారు. నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలను మే 18వ తేదీ లోపు విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా, ప్రధాని నాలుగోదశ లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రోజే మాల్స్, సెలూన్స్ విషయాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించడంతో వాటికీ ఈ లాక్ డౌన్‌లో మినహాయింపు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.