Begin typing your search above and press return to search.

ఇక 24గంటలు పబ్బులు.. రెచ్చిపోండి

By:  Tupaki Desk   |   19 Jan 2020 6:29 PM IST
ఇక 24గంటలు పబ్బులు.. రెచ్చిపోండి
X
మహారాష్ట్రలో గద్దెనెక్కినప్పటి నుంచి వివాదాస్పద సంచలన నిర్ణయాలతో హోరెత్తిస్తున్న శివసేన సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఇక 24 గంటల పాటు పబ్బులు - మాల్స్ - రెస్టారెంట్లు - మల్టీపెక్స్ లు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉద్దవ్ ఠాక్రే ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించారు.

జనవరి 26 నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ముంబైలోని ఫోర్ట్ కాలా ఘెడా , బాంద్రా కుర్లా ప్రాంతాల్లో మాల్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్ లు, పబ్బులు 24 గంటల పాటు తెరిచి ఉంచుకునేలా అనుమతిచ్చారు. ఈ మేరకు కార్పొరేషన్, పోలిస్ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. ప్రజల నివాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లోనే 24గంటలు తెరిచి ఉంచేలా అనుమతిస్తున్నామని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

ముంబైలో పర్యాటకం పెంచడం.. ఆర్థిక రాజధానిలో కంపెనీల పనితీరును ప్రోత్సహించడం.. ఉద్యోగావకాశాలు పెంచడం.. లక్ష్యంగా 24గంటల ప్రతిపాదన తెచ్చిన మంత్రి ఆదిత్యా ఠాక్రే తెలిపారు. కాగా ఈ ప్రకటనపై మాల్స్, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్ లు, పబ్బుల నిర్వాహకులు స్వాగతించారు. దీని ద్వారా ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.