Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే

By:  Tupaki Desk   |   26 Oct 2022 7:09 AM GMT
కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే
X
100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి తొలిసారి గాంధీలు కాని నేత అధ్యక్షుడయ్యాడు. ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గేకు ఈ సందర్భంగా రాహుల్ పుష్పగుచ్ఛం అందించారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ పగ్గాలను చేపట్టారు.

ఖర్గే వయసు 80 ఏళ్లు. ఇవాళ ఉదయం సోనియా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికెట్ ను అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. ఓ కార్మికుడికి కుమారుడు, ఓ కాంగ్రెస్ వర్కర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారని.. తనకు ఉన్న పనితనం, అనుభవంతో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఖర్గే ఇవాళ ఉదయం రాజ్ ఘాట్వెళ్లి అక్కడ నివాళి అర్పించారు. కష్టకాలంలో పార్టీని ముందు ఉండి నడిపిన సోనియాకు ఖర్గే థ్యాంక్స్ తెలిపారు. ఆమె నేతృత్వంలోని రెండు సార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే..

137 ఏళ్ల చరిత్రగల పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే .. పోటీగా శశిథరూర్ ఈ ఎన్నికల్లో నిలబడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు ఖర్గే , పీసీసీ ప్రతినిధుల మెప్పు పొందే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. రెబల్ గా అధిష్టానానికి వ్యతిరేకంగా పోటీచేసిన శశిథరూర్ చిత్తుగా ఓడారు.

మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే వివాదరహితుడు అనే పేరు ఉంది. దళిత వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్న తెలివైన నాయకుల్లో ఒకరు. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో థరూర్ ముందున్నారు. కానీ అసమ్మతి రాజేయడమే ఆయనకు మైనస్ గా మారింది. అధిష్టానానికి నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీచేయడమే ఓటమికి కారణమైంది. ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాలతోనే ఓడిపోయానని మరో వివాదాన్ని రాజేస్తున్నారు. ఆయనను పార్టీ నుంచి సాగనంపే చర్యలను కాంగ్రెస్ చేపట్టింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.