Begin typing your search above and press return to search.

ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో మరో కీలక ముందడుగు

By:  Tupaki Desk   |   2 April 2021 2:30 PM IST
ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో మరో కీలక ముందడుగు
X
ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ మరో పెద్ద స్టెప్ వేసింది. ఆ సంస్థలన్నింటికి కలిపి ఒక చైర్ పర్సన్ ను నియమించింది. వాటిని అమ్మడానికా? లేక లాభాల్లోకి తేవడానికి తెలియదు కానీ.. ఈ కొత్త నియామకం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ (టీఏఎఫ్ఈ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికా శ్రీనివాసన్ ను ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్బీ) చైర్ పర్సన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సిబ్బంది (పర్సనల్) మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రైవేటు రంగంలోని నిపుణురాలిని పీఈఎస్బీ చైర్ పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో టాప్ మేనేజ్ మెంట్ పోస్టుల నియామకానికి బాధ్యత వహించే చైర్ పర్సన్ పదవికి ప్రైవేటు రంగ నిపుణులను తొలిసారి నియమించారు.

గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఈ పదవుల్లో పెట్టేవారు. ఆ సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం మంగళం పాడుతూ ఓ ప్రైవేటు సంస్థకు చైర్ పర్సన్ గా పనిచేసిన మహిళను పీ.ఈ.ఎస్.బీకి నియమించడం విశేషం. 65 ఏళ్ల వరకు ఆమె పదవిలో కొనసాగవచ్చు. మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మల్లిక వయసు 61 ఏళ్లు ఇప్పుడు. కేబినెట్ నియామకాల కమిటీ మల్లికా నియామకాన్ని ఆమోదించింది.