Begin typing your search above and press return to search.

జగన్ ఆప్తుడికి సీఎం ఆఫర్? మల్లాడి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Feb 2021 9:00 AM IST
జగన్ ఆప్తుడికి సీఎం ఆఫర్? మల్లాడి సంచలన వ్యాఖ్యలు
X
ఉత్తరాదిలో ఇప్పటికే పాగా వేసిన బీజేపీ ఇప్పుడు తనకు కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాలపై పడింది. క్రమంగా దక్షిణాదిన సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే తమిళనాడులో ఉన్న పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంపై బీజేపీ కన్ను పడింది.

ఈ ఏడాది జరిగే పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక పుదుచ్చేరిలో భాగంగానే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం ఉంటుంది. యానాం కూడా పుదుచ్చేరి కిందకే వస్తుంది. పుదుచ్చేరికి 800 కిలోమీటర్ల దూరంలో యానాం ఉన్నా ఇక్కడ రాజకీయంగా యాక్టివ్ గా ఉంటారు. పుదుచ్చేరి రాజకీయాలను శాసిస్తూ వస్తోంది.

దాదాపు 25 ఏళ్లుగా యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాది నాలుగు సార్లు మంత్రి అయిన మల్లాడి కృష్ణరావు బలంగా ఉన్నారు.ఆయన తాజాగా బీజేపీ వైపు మొగ్గుచూపుతుండడం ఆ పార్టీకి బలంగా మారింది. 25 ఏళ్లుగా యానాం ఎమ్మెల్యేగా ఉన్న ఈయన గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ సీఎం క్యాండిడేట్ అవుతాడని అంటున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ తరుఫున వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే పదవులను మల్లాడి వదులుకున్నారు. ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్లు తెలుస్తోంది. పాండిచ్చేరి సీఎం పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇటీవలే ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన బీసీల సభలో మల్లాడి పాల్గొన్నారు. జగన్ కోరితే పుదుచ్చేరిలో చేస్తున్న రాజకీయాలను వదిలి ఆయనతో కలిసిపనిచేస్తానన్నారు. జగన్ కూడా ఈయనకు అత్యున్నత పదవిని ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ కోరితే అటు సీఎం క్యాండిడేట్ గా పంపుతాడని అంటున్నారు. జగన్ రికమండేషన్ కూడా పనిచేస్తోందని ప్రచారం సాగుతోంది.