Begin typing your search above and press return to search.

మంత్రి - ఎమ్మెల్యే డ్యాన్సులు అదుర్స్‌ గురూ

By:  Tupaki Desk   |   9 March 2019 6:41 AM GMT
మంత్రి - ఎమ్మెల్యే డ్యాన్సులు అదుర్స్‌ గురూ
X
ఉత్సాహం వస్తే సరదాగా కాలు కదపడం ఎవ్వరికైనా సహజం. అందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. లీడర్లు కూడా తన కార్యకర్తలు కోసం.. జనంలో ఉత్సాహాన్ని నింపడం కోసం చిన్న చిన్న స్టెప్పులేస్తుంటారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు ఉంటారు మేడ్చల్‌ ఎమ్మెల్యే మరియు తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఆయన ఫిజిక్‌ భారీగా ఉంటుందేమో కానీ స్టెప్పులేయడానికి ఆయనకు ఫిజిక్ ఏం అడ్డం రాదు. అద్భుతమైన డ్యాన్సులతో అభిమానుల్ని అలరిస్తారు ఆయన. గతంలో.. మల్లారెడ్డి కాలేజీ ఫంక్షన్లకు ఎప్పుడైనా ముఖ్యఅతిధిగా వస్తే.. ఆయన స్టెప్పులు కచ్చితంగా వేయాల్సిందే.

ఇక నిన్నటికి నిన్న మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిథిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ వచ్చారు. కేటీఆర్‌ రావడానికి ముందుగా కళాకారుల చేత సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల కోసం అప్పటికే అకక్డ ఉన్న మల్లారెడ్డి కార్యకర్తల్ని ఎంటర్‌ టైన్ చేయడం కోసం డ్యాన్సులు వేసి అలరించారు. ఆయనతో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే కూడా రెండు మూడు స్టెప్పులు వేసి అందర్ని ఉత్సాహపరిచారు. అయితే ఒకటి మాత్రం నిజం. మల్లారెడ్డి డ్యాన్సు ముందు, ఆయన జోష్‌ ముందు అక్కడున్న కళాకారులు కూడా తేలిపోయారంటే అతిశయోక్తి కాదు.అంతలా తన డ్యాన్సులతో అందర్ని ఉత్సాహపరిచారు మల్లారెడ్డి.