Begin typing your search above and press return to search.

బాబుకు మరో ఝలక్ తప్పదా?

By:  Tupaki Desk   |   5 Jun 2015 3:43 PM IST
బాబుకు మరో ఝలక్ తప్పదా?
X

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తన వారు అనుకున్నవాళ్లు కూడా... భిన్నంగా స్పందించిట్లు స్పష్టం అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్స్ దాటికి ఈ మధ్య పార్టీ నేతల వలసల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీగా మల్లారెడ్డి హాజరై ప్రసంగించారు. కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ ఆయనతోనే సాధ్యమని కీర్తించారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని కీర్తించారు.

టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా కీర్తించిన మల్లారెడ్డి గతంలో వెళ్లిన నాయకుల వలే సీఎం కేసీఆర్ మాయలో పడ్డారా అనే సందేహం కలిగించే విధంగా మాట్లాడారు.