Begin typing your search above and press return to search.

మోడీ ప్రణాళికలకు పాకిస్థాన్ లోనూ ప్రశంసలు

By:  Tupaki Desk   |   30 Nov 2016 11:59 PM IST
మోడీ ప్రణాళికలకు పాకిస్థాన్ లోనూ ప్రశంసలు
X
మోడీ అనౌన్సు చేసి డీమోనిటైజేషన్ నిర్ణయంతో దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అదే సమయంలో ఆ నిర్ణయం దేశానికి మేలు చేస్తుందంటూ ప్రశంసిస్తున్నారు. విపక్ష నేతలు కూడా ప్రజలు ఇబ్బందులనే హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు కానీ నిర్ణయాన్ని తప్పు పట్టలేని పరిస్థితి. మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. దేశంలో పరిస్థితులు ఇలా ఉండగా మోడీ నిర్ణయం మన శత్రుదేశం పాకిస్థాన్ లోనూ పెద్ద ఎత్తున చర్చలకు కేంద్ర బిందువు అవుతోంది. కొందరైతే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా మోడీ మాదిరిగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్లు మొదలుపెట్టారు.

భారత్ లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ లో అత్యంత సంపన్నుల్లో ఒకరైన మాలిక్ రియాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో పాకిస్థాన్ కూడా భారత్ అడుగుజాడల్లో నడవాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆయన సూచించారు. పెద్దనోట్ల రద్దుతో భారత్ ప్రభుత్వం ఇప్పటివరకు 228 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిసిందని, ఈ విషయంలో భారత ప్రధాని మోడీని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనుసరించి ఉంటే కనుక పాకిస్థాన్ లో 10 నుంచి 15 బిలియన్ డాల్లర్లు వసూలు అయి ఉండేదని అభిప్రాయపడ్డారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన బిలియన్ డాలర్ల ఐడియా అంటూ కీర్తించారు. ఈ ఐడియాను కనుక పాక్ లో అమలు చేస్తే ఇక్కడి నల్లధనం అంతా ఊడ్చుకుపోతుందని అన్నారు. నల్లధనం కారణంగా పాక్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటోందని అన్నారు. యాభై రోజుల ముందుగా అధికారిక ప్రకటన చేసి పాకిస్థాన్ లోని రూ.500 - రూ.1000 - రూ.5000 నోట్లను రద్దు చేయాలని.. విదేశాల్లోని పాకిస్థాన్ పౌరులకు కూడా దీనిని వర్తింపజేయాలని మాలిక్ రియాజ్ సూచనలు చేశారు. మొత్తానికి మోడీ ప్రణాళికలు పాక్ ప్రజలను కూడా అట్రాకక్టు చేస్తున్నాయి... మరి షరీఫ్ ఆ మాట వింటారో పెడచెవిన పెడతారో చూడాలి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/