Begin typing your search above and press return to search.

వైర‌ల్‌ గా.. ఒబామా కూతురి ల‌వ్ మ్యాట‌ర్

By:  Tupaki Desk   |   23 Jan 2018 8:04 AM GMT
వైర‌ల్‌ గా.. ఒబామా కూతురి ల‌వ్ మ్యాట‌ర్
X
ప్ర‌ముఖుల కుటుంబాల మీద ఒక ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి అంద‌రిలోకి ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రి వ్య‌క్తిగ‌త జీవితాల్లో ఉండే అన్ని అనుభూతులు ప్ర‌ముఖుల ఇళ్ల‌ల్లో ఉంటాయ‌న్న విష‌యం వాస్త‌వ‌మే అయినా.. ఆ విష‌యాన్ని రోటీన్ గా తీసుకునే త‌త్వం జ‌నాల్లో ఉండ‌దు. ఈ కార‌ణంతోనే.. ప్ర‌ముఖులకు సంబంధించిన అంశాల ప‌ట్ల ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని అంద‌రూ వ్య‌క్తం చేస్తుంటారు.

తాజాగా అలాంటిదే ఇప్పుడు అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాకు రెండు ట‌ర్మ్స్ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన బ‌రాక్ ఒబామా కుమార్తెల్లో ఒక‌రైన మ‌లియా ఒబామా ఇప్పుడు పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న కొత్త ప్రియుడు రోరి ఫ‌ర్కుహ‌ర్స‌న్ తో క‌లిసి న్యూయార్క్ న‌గ‌రంలో తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

బ్రిట‌న్‌ కు చెందిన ఈ కుర్రాడి తండ్రి సంప‌న్నుడిగా చెబుతున్నారు. బ్రిట‌న్ లో అత్యంత సంప‌న్నులు చ‌దువుకునే ప్ర‌ఖ్యాత ర‌గ్బీ స్కూల్లో చ‌దివి.. స్కూల్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన రోరితో మ‌లియా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. పిల్లాడి తండ్రి లండ‌న్ లోని ఒక ప్ర‌ముఖ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ మేనేజ్ మెంట్ గ్రూప్ న‌కు చీఫ్ గా ఎగ్జిక్యుటివ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా త‌న ప్రియుడితో క‌లిసి మ‌లియా స‌న్నిహితంగా సిగిరెట్ తాగుతూ క‌నిపించింది. మ‌లియా న‌వ్వులు చిందించే ఫోటోలు.. వారికి సంబంధించిన కొన్నిఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. 19 ఏళ్ల మ‌లియా.. ఆమె ప్రియుడు రోరి ఇద్ద‌రు హార్వ‌ర్డ్ వ‌ర్సిటీలో చ‌దువుకుంటున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రి ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి క‌ల‌క‌లం రేపుతున్నాయి.