Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో వింత .. పాలిస్తున్న మగ మేక

By:  Tupaki Desk   |   29 July 2020 4:00 PM IST
రాజస్థాన్ లో వింత ..  పాలిస్తున్న మగ మేక
X
రాజస్థాన్‌ లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ మగ మేక పాలు ఇస్తుంది. అదేంటి మగ మేక పాలు ఇవ్వడం ఏంటి మేము మీకు ఎలా కనిపిస్తున్నాం అని అనుకుంటున్నారా ? ఆశ్చర్యపోవాల్సిన విషయమే కానీ నిజమే. అవును ఆ మేక పాలిస్తుంది. హ‌ర్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా మేక పాలు ఇస్తుంద‌ని ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ వైద్యులు చెబుతున్నారు.

పూర్తి వివరాలు చూస్తే .. రాజ‌స్థాన్ ధోల్పూరు లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుష్వాహా ,కొద్ది రోజుల క్రితం రెండున్న‌ర నెల‌ల వ‌య‌సున్న ఓ మేక‌ను కొనుగోలు చేశాడు. ఆరు నెల‌ల త‌ర్వాత ఆ మేక పొదుగు ను అభివృద్ధి చేసింది. అది చూసి ఆశ్చార్యానికి గురయ్యాడు. పొదుగును పితకగా.. పాలు రావడాన్ని గమనించాడు. ప్రతి రోజు దాదాపు 200 నుంచి 250 గ్రాముల పాలను ఇస్తున్నట్లు మేక యజమాని తెలిపారు. ఓ మ‌గ మేక పాలివ్వ‌డం చరిత్ర లో ఇదే మొద‌టిసారి అని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఆ మేక పాలివ్వ‌డాన్ని తాము గ‌మ‌నించాన‌మి స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భం గా వెట‌ర్న‌రీ స‌ర్జ‌న్ సక్సేనా మాట్లాడుతూ.. మేక గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో.. హ‌ర్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఆడ జ‌న‌నేంద్రియాలు, ద్వితీయ లైంగిక ల‌క్ష‌ణాలు అభివృద్ధి అవుతాయ‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితి చాలా అరుదు. ఇలాంటి కేసులు మిలియ‌న్ కేసుల్లో ఒక‌టి జ‌రుగుతుంద‌ని స‌క్సేనా చెప్పారు.