Begin typing your search above and press return to search.
జియోలో వాటాల అమ్మకం.. అసలు కథేంటి?
By: Tupaki Desk | 10 May 2020 7:00 AM ISTదేశంలోనే నంబర్ 1 అపర కుబేరుడు అయిన.. అలాంటి ధనవంతుడికి కూడా కష్టాలా? అని ఆశ్చర్యపోకండి.. కరోనా దెబ్బకు దేశంలోనే ధనవంతుడికి నష్టాలొచ్చాయి. జియోతో దేశంలో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నష్టాల పాలయ్యారు. ఏకంగా జియోలో 10శాతం షేర్ ను ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ఇటీవలే అమ్మారు. 45వేల కోట్లను సంపాదించారు. అప్పులను తీర్చారు. నష్టాలను తగ్గించుకున్నారు.
ఇది జరిగి పదిహేను రోజులు గడవక ముందే రిలయన్స్ మరోసారి మూడు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా విస్టా కంపెనీతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుమందు సిల్వర్ లేక్ తో ఒప్పందం చేసుకుంది.
ఈ మూడు ఒప్పందాల విలువ ఏకంగా రూ.60600 కోట్లు. 2021 మార్చి నాటికి అప్పులు లేని రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దే క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీల్లో వాటాలు విక్రయిస్తున్నారు.
తాజాగా కుదుర్చుకున్న అమెరికా కంపెనీ విస్టా సహ వ్యవస్థాపకులు బ్రియాన్ సేథ్ తండ్రిది గుజరాత్ కావడం విశేషం. తల్లి ఐరిష్. ముఖేష్ అంబానీ కూడా గుజరాతీయే.. ఈ కంపెనీ వ్యవస్థాపకులు రాబర్ట్ స్మిత్ తో ముఖేష్ అంబానీకి వ్యక్తిగత అనుబంధం ఉంది. విస్టా అంతర్జాతీయ టెక్ పెట్టుబడుల సంస్థ.ఈ సంస్థ కంపెనీల నెట్ వర్క్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ.
ప్రస్తుతం జియోలో మొత్తం 13.46శాతం వాటాను రిలయన్స్ విక్రయించింది. ఇందులో ఫేస్ బుక్ కు రూ.43574 కోట్లుతో 9.99శాతం వాటాను విక్రయించింది. ఆ తర్వాత సిల్వర్ లేక్ కు రూ. 5666 కోట్లతో 1.15శాతం వాటాను.. ఇప్పుడు విస్టాకు రూ.11367 కోట్లతో 2.32శాతం వాటాను రిలయన్స్ విక్రయించింది.
జియో మొత్తం వ్యాల్యూ రూ.5.16లక్షల కోట్లు. ఇప్పటిదాకా 13.46శాతం వాటాను అమ్మిన ముఖేష్ అంబానీ సమీప భవిష్యత్తులో 20శాతం వాటాను వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అప్పుల్లో కూరుకుపోయిన జియోను బతికించుకునేందుకు 2021మార్చినాటికి రుణ రహిత సంస్థగా నిలబెట్టేందుకు జియోలో వాటాలు విక్రయిస్తున్నారు.