Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ వీధుల్లో నాటు బాంబుల తయారీ..!

By:  Tupaki Desk   |   2 March 2022 3:30 AM GMT
ఉక్రెయిన్ వీధుల్లో నాటు బాంబుల తయారీ..!
X
రష్యా-ఉక్రెయిన్ నడుమ యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఆ దురాక్రమణ ఆపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందుకోసం తమ వద్ద ఉన్న మానవ, సైనిక వనరులను ఉపయోగించుకుంటోంది. మరోవైపు ఆయుధాలను పెంచుకోవడం కోసం వివిధ దేశాలను సాయం అభ్యర్థిస్తోంది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు మానవ, ఆయుధ సాయం అందించడానికి అమెరికా ముందుకొచ్చింది. మరికొన్ని నాటో దేశాలు కూడా మద్దతుగా నిలిచాయి. కాగా దేశీయంగా కూడా ఆయుధాలను తయారు చేస్తున్నారు.

ఉక్రెయిన్ యుద్ధం కాస్తా వీధులకు చేరింది. ఆ దేశ రాజధాని కీవ్ లో రష్యా దాడులు పెరుగుతున్నాయి. ఎటుచూసినా బాంబుల వర్షం కురుస్తోంది. మరోవైపు కొంతమంది మహిళలు నాటు బాంబులు తయారు చేస్తున్నారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి మేము సైతం అంటున్నారు. అందుకే ఈ నాటు బాంబుల తయారీకి సిద్ధమయ్యారు. మహిళలు తయారు చేసిన ఈ నాటు బాంబులను పురుషులు... సరఫరా చేస్తారు.

ఓ పొడవాడి గాజు సీసా తీసుకుంటారు. అందులో ఆల్కహాల్, పెట్రోల్ పోస్తారు. వీటితో పాటు అత్యధికంగా మండే శక్తి గల ఇతర ద్రావణాలను నింపుతారు. వాటికి కొంచెం మోటార్ ఆయిల్ కూడా కలుపుతారు. దీనికి ఒక గుడ్డ అమర్చుతారు. వస్త్రం పీలిక కాస్త బయటకు వేలాడేటట్లుగా ఉంచుతారు. అది మెల్లమెల్లగా లోపలి ద్రావణాన్ని పీల్చుకుంటుంది.

అలా ఉంచిన తర్వాత ఆ క్లాత్ కు మంట తగిలితే అది పేలుడు పదార్థంలాగా బ్లాస్ట్ అవుతుంది. ఇలా అవసరం అనుకున్నప్పుడు ఆ గుడ్డముక్కకు మంట పెడతారు. ఇలా ఉక్రెయిన్ మహిళలు... నాటు బాంబులను తయారు చేస్తున్నారు. వీటినే మోలోటోవ్ కాక్ టెయిల్ అని పిలుస్తారు.

ఈ నాటు బాంబులు తయారు చేయడం చాలా సులభమైన పద్దతి. కాబట్టి వీటిని తర్వాత దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. వీటిని నేరస్థులు, సంఘ విద్రోహక శక్తులు, టెర్రరిస్టులు కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఆయుధాలు తక్కువైనప్పుడు ఆర్మీ కూడా వీటిని ఉపయోగిస్తుందని సమాచారం. ఈ విధంగా అతి తక్కువ ఖర్చుతో... వేగంగా అక్కడి మహిళలు పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నారు.