Begin typing your search above and press return to search.

మేక్ ఇన్ ఇండియా...అంత సీన్ లేదట

By:  Tupaki Desk   |   16 Jan 2017 6:25 AM GMT
మేక్ ఇన్ ఇండియా...అంత సీన్ లేదట
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక మేక్ ఇన్ ఇండియాపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. మేకిన్ ఇండియాకు స్పందన అపూర్వమని కేంద్ర ప్రభుత్వం అంటున్న సంగతి తెలిసిందే. కానీ విశ్లేషకులు మాత్రం ఈ కార్యక్రమ విజయంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం విజయవంతమైతే పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌ డీఐ) పెరుగాలి కానీ, వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తాజాగా ఓ నివేదికలో విశ్లేషకులు పేర్కొన్నారు.

మేక్ ఇన్ ఇండియా పథకం వల్ల పెట్టుబడులు పెరిగితే దేశవ్యాప్తంగా అదనంగా ఉత్పత్తి అందుబాటులోకి వచ్చేది..కానీ ఈ పరిస్థితులేమి కనిపించడం లేదని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌ మెంట్ (ఐఎస్‌ ఐడీ) మాజీ ప్రొఫెసర్ కేఎస్ చలపతిరావు - జవహర్‌ లాల్ నెహ్రూ యునివర్సిటీ ప్రొఫెసర్ బిస్వజిత్ ధార్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రభుత్వం విశ్లేషణలు ఆశించదగిన రీతిలో ఉన్నప్పటికీ అవి వాస్తవ రూపం దాల్చలేదని ఈ ప్రొఫెసర్లు తమ అధ్యయనంలో విశ్లేషించారు. భారత్‌ ను తయారీ - డిజైన్ - ఇన్నోవేషన్ హబ్‌ గా తీర్చిదిద్దడానికి కేంద్రం..అక్టోబర్ 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. రక్షణ - ఫుడ్ ప్రాసెసింగ్ - లెదర్‌ లతోపాటు మరో 25 రంగాల్లోకి పెట్టుబడులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో ఆటోమెటిక్ రూట్‌ లోనే ఎఫ్‌ డీఐలు వచ్చాయని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2014 నుంచి మే 2016 మధ్యకాలంలో ఎఫ్‌ డీఐలు 46 శాతం పెరిగి 6,158 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/