Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ : మద్యం హోం డెలివరీ చేయమన్న సుప్రీం !
By: Tupaki Desk | 8 May 2020 5:20 PM ISTలాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. 40 రోజుల తరువాత మందు షాప్స్ తెరుచుకోవడంతో మందుబాబులు కరోనా ఉందనే భయం కూడా లేకూండా , సామజిక దూరం పాటించకుండా మద్యం షాప్స్ ముందు బారులు తీరారు. లాక్ డౌన్ టైం లో మద్యం అమ్మకాలు సామాన్యుల జీవితంపై ప్రభావం చూసే అవకాశం ఉందని ఓ ఫీల్ దాఖలైంది. ఆ ప్రజా ప్రయోజన వాజ్యం పై జస్టిస్ అశోక్ భూషణ్ - జస్టిస్ సంజయ్ కిషన్ - జస్టిస్ బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
మద్యం అమ్మకాలకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం. కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని మద్యం హోం డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు, సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ను స్ట్రిక్టుగా అమలు చేసేందుకు మద్యం హోం డెలివరీ గురించి ఆలోచించడం మంచిదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయి లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది.
కాగా, మూడో దశ లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు.. ఒక్కసారిగా వైన్ షాపుల ముందు బారులు తీరారు. ముంబైలో ఈ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కేవలం రెండు రోజుల్లోనే మద్యం షాపులను మళ్లీ మూసివేశారు. మరోవైపు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం హోం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఇప్పటికే పంజాబ్ - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్న సంగతి తెలిసిందే.