Begin typing your search above and press return to search.

తుపాకి అందరికన్నా ముందే చెప్పింది

By:  Tupaki Desk   |   23 May 2019 6:44 AM GMT
తుపాకి అందరికన్నా ముందే చెప్పింది
X
అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తించిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న ఫ‌లితాలు న‌మోద‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నేటి ఉద‌యం ప్రారంభ‌మైన కౌంటింగ్ లో ఆది నుంచి స్ప‌ష్ట‌మైన ఆధిక్యంతో దూసుకుపోతున్న వైసీపీ... 140 సీట్ల దాకా సాధించే అవ‌కాశాలు కూడా లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే 140 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థులు ఓట‌మిపాల‌య్యే అవ‌కాశాలు కూడా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. వైసీపీ పైనా - ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తూ సాగిన ఏపీ మంత్రులెవ‌రూ కూడా గెలిచే అవకాశాలు క‌నిపించ‌డం లేదు. టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో స్వ‌ల్ప ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. అయితే ఆయ‌న కేబినెట్ లోని మంత్రులు ఒక్క‌రు కూడా లీడ్ లో లేక‌పోవ‌డం నిజంగానే షాకింగేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ విషయాన్ని తుపాకి అందరికన్నా ముందే చెప్పింది. ఇటీవలే ఈ విషయాన్ని ఒక విశ్లేషణ ద్వారా స్పష్టంగా వెల్లడించాం. తుపాకి చెప్పింది నిజమయ్యింది.

బాబు కేబినెట్ లోని కీల‌క మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు - నారాయ‌ణ‌ - అచ్చెన్నాయుడు - కాల్వ శ్రీ‌నివాసులు - సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి - ప్ర‌త్తిపాటి పుల్లారావు - క‌ళా వెంక‌ట్రావు - భూమా అఖిల‌ప్రియ - సుజ‌య కృష్ణారంగారావు - గంటా శ్రీ‌నివాస‌రావు - చిన‌రాజ‌ప్ప‌- ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులంతా వెనుకంజ‌లో ఉన్నారు. వీరి నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటిలో వైసీపీ అభ్య‌ర్థులు ప్ర‌తి రౌండ్ కు ఆధిక్యం పెంచుకుంటూ పోతున్నారు. ఇక అమ‌రావ‌తి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి నుంచి తొలిసారి బ‌రిలోకి దిగిన చంద్ర‌బాబు కుమారుడు - మంత్రి నారా లోకేశ్ కూడా వెనుక‌బ‌డిపోయారు. లోకేశ్ పై పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి 5 వేల‌కు పైగా ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మొత్తంగా చంద్ర‌బాబు కేబినెట్ లోని మంత్రులంద‌రినీ జ‌నం గంగ‌లో ప‌డేసిన‌ట్టే క‌నిపిస్తోంది.