Begin typing your search above and press return to search.
మజ్లిస్ కీలకభేటీ.. దీదీకి దడ పుట్టే మాట చెప్పారుగా?
By: Tupaki Desk | 13 Dec 2020 8:52 AM ISTమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు హైదరాబాద్ మహానగరం వేదికైంది. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే కీలక సమావేశం ఎలాంటి బజ్ లేకుండా చోటు చేసుకుంది. ఆలిండియా మజ్లిస్ - ఎ - ఇత్తేహాదుల్ ముస్లీమీన్ అలియాస్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు (శనివారం) సాయంత్రం పశ్చిమబెంగాల్ కు చెందిన నేతలతో కలిసి కీలక భేటీని నిర్వహించారు. అనంతరం.. ఆయన సోషల్ మీడియాలో ఆ వివరాల్ని వెల్లడించారు. త్వరలో జరిగే బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో తాము పోటీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ లో జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఆసక్తికర చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. బెంగాల్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. పార్టీని విస్తరించేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగినట్లుగా అసద్ పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇటీవలే ఆయన.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించటాన్ని మర్చిపోకూడదు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ బరిలోకి దిగితే.. బెంగాల్ అధికారపక్షానికి కొత్త టెన్షన్ ఖాయమంటున్నారు. దీనికి కారణం కీలకమైన మైనార్టీ ఓట్లు ఇప్పటివరకు దీదీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడుమజ్లిస్ ఎన్నికల బరిలో దిగటంతో ఆ పార్టీకి ఓటు బ్యాంక్ షేర్ తీసుకుంటే.. అంతిమంగా మేలు జరిగేది బీజేపీకే అన్నది మర్చిపోకూడదు. గడిచిన కొంతకాలంగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మజ్లిస్ పోటీకి దిగటం.. మైనార్టీ ఓట్లను ఆ పార్టీ తన ఖాతాలో వేసుకోవటం.. అంతిమంగా ఈ కాంబినేషన్ కొంత మజ్లిస్ లాభాన్ని కలిగిస్తుంటే.. ఎక్కువభాగం బీజేపీకి లబ్ధి చేకూరుతుందని చెప్పక తప్పదు.
మొన్నటికి మొన్న బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసిన మజ్లిస్.. అనూహ్యంగా ఐదు స్థానాల్లో గెలుపొందటమే కాదు.. అధికారంలోకి వస్తుందని భావించిన మహా ఘట్ బంధన్ కు అవకాశం లేకుండా చేసిందన్నది మర్చిపోకూడదు. ఇదే వ్యూహం బెంగాల్ లోనూ వర్కువుట్ అయితే.. ఆ రాష్ట్రంలో మజ్లిస్ ఖాతా తెరవటమే కాదు.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందన్నది మర్చిపోకూడదు. మజ్లిస్ బరిలోకి దిగటంపై బెంగాల్ అధికారపక్ష అధినేత్రి మమతా బెనర్జీ ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తంగా చూస్తే.. తాజాగా జరిగిన సమావేశం దేశ రాజకీయాల మలుపు తిప్పటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.