Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ ను కొట్టినందుకు నటికి జైలుశిక్ష

By:  Tupaki Desk   |   14 May 2016 5:06 AM GMT
కానిస్టేబుల్ ను కొట్టినందుకు నటికి జైలుశిక్ష
X
కోలీవుడ్ నటి మైత్రేయి గౌడ్ కు జైలుశిక్ష పడింది. కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్న నేరానికి ఆమెకు.. ఆమె స్నేహితురాలికి జైలుశిక్ష విధిస్తూ బెంగళూరు నగర న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ శిక్ష అమల్లోకి రాకుండా ఉండేందుకు వీలుగా బెయిల్ తీసుకోవటంతో నటి జైలుకు వెళ్లటాన్ని తాత్కాలికంగా తప్పించుకున్నారని చెప్పాలి.

దాదాపు ఐదేళ్ల కిందట (2011)లో నటి మైత్రేయి తన స్నేహితురాళ్లతో కలిసి కారులో వెళుతున్నారు.ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్న మైత్రేయి సెల్ ఫోన్ మాట్లాడుతుండటంతో ఆమె కారును బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిదిలోని హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ఆమె కారుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి ఆగ్రహించిన మైత్రేయి తన స్నేహితురాళ్లతో కలిసి కానిస్టేబుల్ తో కలిసి దాడి చేసే ప్రయత్నం చేశారు.

దాడికి పాల్పడిన మైత్రేయి.. ఆమె ముగ్గురు స్నేహితురాళ్లు చేసిన తప్పు నిరూపితం కావటంతో సినీనటికి రెండేళ్లు.. ఆమె స్నేహితురాళ్లకు ఏడాది చొప్పున జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అయితే.. ఆ వెంటనే మరో కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయటంతో శిక్ష అమలు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నారని చెప్పొచ్చు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం చట్టాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయం ఇప్పటికైనా ఆమెకు అర్థమయ్యే ఉండి ఉంటుంది.