Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కు పాలిటిక్స్ పై క్లారిటీ రాలేదు: మ‌హేష్

By:  Tupaki Desk   |   20 Dec 2017 9:50 AM GMT
ప‌వ‌న్ కు పాలిటిక్స్ పై క్లారిటీ రాలేదు: మ‌హేష్
X
కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు, ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ కు సోష‌ల్ మీడియాలో, మీడియాలో వెర్బల్ వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. `అజ్ఞాత‌వాసి` టీజ‌ర్ పై సెటైరిక‌ల్ `అజ్ఞాన‌వాసి` అంటూ....మ‌హేష్ త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసిన విష‌యం విదిత‌మే. తాజాగా, మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా జ‌రిగిన `అజ్ఞాత‌వాసి` ఆడియో ఫంక్ష‌న్ నేప‌థ్యంలో మ‌హేష్...ప‌వ‌న్ పై త‌న ఫేస్ బుక్ ఖాతాలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడియో ఫంక్ష‌న్ అయిపోయిందని....సినిమా విడుద‌ల‌కు ఉన్న నెల‌రోజుల స‌మ‌యంలో ఏపీ ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ మాట్లాడ‌తారా అని ప్ర‌శ్నించారు.

పవన్ కల్యాణ్‌ పై మహేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ రాజ‌కీయాలు, జ‌న‌సేన పార్టీ గురించి మాట్లాడిన మ‌హేష్ ...`అజ్ఞాత‌వాసి` టీజ‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ సినిమాలు, ఆయ‌న హావ‌భావాలు, డైలాగుల గురించి మాట్లాడ‌డం మొద‌లుపెట్టారు.``ఒక సినిమాలో పక్కన మనిషి చెప్పులు మొయ్యాలి. మోకాలు భక్తితో పెట్టి మెట్లెక్కించే మరో సేవకుడు ఇంకో సినిమాలో...చేగువేరా ఎక్కడికి పోయాడో... ఈ బానిస ఫ్యూడల్ భావజాలాన్ని పెంపొందించే కమ్యూనిస్టు ఎవరో...హతవిధి! ఏమిటీ మీమాంస?``అంటూ మ‌హేష్ రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తాజాగా, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ మ‌రో పోస్ట్ పెట్టారు. ‘పాలిటిక్స్‌ గురించి క్లారిటీ రాలేదు సరే.. ఇప్పుడు సినిమాల మీద ఉన్న క్లారిటీ కూడా పోయినట్లు ఉందే.. ఆడియో ఫంక్షన్‌ అయిపోయింది. సినిమా బాగా అమ్ముడుపోయింది. రిలీజ్‌ కి ఇంకా నెల టైముంది.ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడదామా..! కనీసం నెలైనా!!!’ అని మహేశ్‌ కత్తి తన ఫేస్‌ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.