Begin typing your search above and press return to search.
సంతోష్ కు మహావీర్ చక్ర.. కుటుంబ స్పందన.. ఆనందమే కానీ..
By: Tupaki Desk | 26 Jan 2021 3:00 PM ISTచైనా సైన్యంతో జరిగిన పోరాటంలో మరణించిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ మీడియాతో మాట్లాడారు. కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. కానీ.. కాస్త అసంతృప్తి కూడా ఉందని వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘మహావీర్ చక్ర పురస్కారం చూశాక మావాడి శక్తి సామర్ధ్యాలు ధైర్య సాహసాలు తెలుస్తున్నాయి. ఎంతోమంది యువతలో స్ఫూర్తి రగిల్చాడు కల్నల్ సంతోష్ బాబు. 15 ఏళ్ల సర్వీస్ లో 10 ఏళ్ళు ఫీల్డ్ సర్వీస్ చేశాడు. ఆర్మీలో పని చేసే అవకాశం అందరికిరాదు సంతోష్ బాబుకు వచ్చింది. సంతోష్ బాబు తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ధన్యజీవుడు అయ్యాడు. వెపన్స్ లేకుండా ధైర్య సాహసాలతో సంతోష్ బాబు టీం చైనాతో పోరాడింది. ఇండియాకు చెందిన ఒక్క ఇంచు జాగకూడా చైనాకు పోకుండా సంతోష్ బాబు టీం పోరాటం సాగించింది.
ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబుకు.. పరమ వీర్ చక్ర పురస్కారం అందిస్తే బాగుండేది. ఈ పురస్కారం అందించడానికి అన్నివిధాలా సంతోష్ అర్హుడని మేము భావిస్తున్నాం. అయితే.. మహావీర్ చక్ర పురస్కారం తక్కువేమీ కాదు. దీనివల్ల మా కుటుంబానికి గౌరవం, సంతోష్ బాబు త్యాగానికి అరుదైన పురస్కారం దక్కినట్లైంది. కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం దక్కినట్లు మాకు రాత్రి వాట్సప్ లో లెటర్ పెట్టారు. ఈ రోజు మహావీర చక్ర పురస్కారం మాకు ప్రదానం చేస్తామని చెప్పలేదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి పురస్కారం తీసుకుంటాం.
పరమ వీర్ చక్ర పురస్కారం లభించి నట్లైతే పూర్తి న్యాయం జరిగేదని నా అభిప్రాయం. ప్రస్తుతం సంతోష్ బాబు లేకున్నా.. అందరి మనసుల్లో ఉంటాడు. సంతోష్ బాబులా ఆర్మీలో పని చేసి ఒక్కరోజు బతికినా చాలు అని యూత్ అంటోంది. కల్నల్ సంతోష్ బాబు ను చూసి ఆర్మీలో చేరేందుకు రెండు తెలుగురాష్ట్రాల్లో యూత్ ముందుకు వస్తున్నారు’’
ఇక కల్నల్ సంతోష్ తల్లి మంజుల మాట్లాడుతూ... ‘‘సంతోష్ బాబు కు మహావీర చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది.సంతోష్ బాబు త్యాగానికి పరమవీర చక్ర ఇస్తే ఓ తల్లిగా ఇంకా సంతోష పడేదాన్ని. సంతోష్ త్యాగం మాములుది కాదు. సుప్రీం శాక్రిఫైజ్. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం చైనాతో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశాడు. నాకున్న దేశ భక్తిని కల్నల్ సంతోష్ బాబుకు నూరి పోశాను. కల్నల్ సంతోష్ బాబు టీం పరాక్రమం చూశాక ఇండియా సత్తా చైనాకు తెలిసింది’’ అని అన్నారు.