Begin typing your search above and press return to search.
గాంధీ మునిమనమడి ప్రాణాల్ని తీసిన మహమ్మారి
By: Tupaki Desk | 23 Nov 2020 8:30 AM ISTజాతిపిత మహాత్మాగాంధీ మునిమనమడు సతీశ్ ధుపేలియా తాజాగా మరణించారు. గడిచిన కొద్దిరోజులుగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన.. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. తన సోదరుడు సతీశ్ మరణించినట్లుగా ఆమె సోదరిఉమా ధుపేలియా పేర్కొన్నారు. 66 ఏళ్ల సతీశ్ దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో ఉంటున్నారు.
తన జీవితంలో ఎక్కువ భాగం మీడియా రంగంలోనే పని చేశారు. వీడియో.. ఫోటోగ్రాఫర్ గా పని చేసిన ఆయన.. కొద్ది రోజులుగా న్యూమోనియా సమస్యతో బాధ పడుతున్నారు. దీంతో.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. మూడు రోజుల క్రితమే పుట్టినరోజు వేడుకల్ని ఆసుపత్రిలో జరుపుకున్నారు.
దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్ మెంట్ ట్రస్ట్ కార్యకలాపాల్ని ఆయన నిర్వహించేవారు. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. అలాంటి ఆయన ఉన్నట్లుండి మరణించటం షాకింగ్ గా మారింది. ఆదివారం రాత్రి హటాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆయన ప్రాణాలు పోయినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
కరోనా సోకిన వారిలో పలువురిలో గుండె సమస్లు చోటు చేసుకోవటం తెలిసిందే. కరోనా బారిన పడి.. కోలుకున్నాక కూడా గుండె సంబంధిత సమస్యలకు పలువురు గురవుతున్నారు. హటాత్తుగా వచ్చే గుండెపోటు ఇప్పటికే పలువురి ప్రాణాల్ని తీసినట్లుగా వైద్యులు చెబుతున్నారు. సతీశ్ విషయంలోనూ అలాంటి పరిస్థితే చోటు చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు.