Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో పోలీసులపై కరోనా పంజా..మరో 222 మందికి పాజిటివ్!

By:  Tupaki Desk   |   10 July 2020 1:41 PM GMT
ఆ రాష్ట్రంలో పోలీసులపై కరోనా పంజా..మరో 222 మందికి పాజిటివ్!
X
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎవ్వరు ఊహించని విధంగా పెరుగుతూనే ఉన్నాయి . ముఖ్యంగా మహారాష్ట్ర రాజధాని ముంబై ‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు చాలామంది వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 2 లక్షల 30 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ పోలీసులు సిబ్బంది కూడా కరోనా భారిన పడుతున్నారు.

తాజాగా గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ గా తేలిందని . దీనితో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసు సిబ్బంది సంఖ్య 5,935కి చేరిందని , అలాగే గడిచిన 48 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు సిబ్బంది మరణించారని , దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 74 మంది పోలీసు సిబ్బంది మరణించారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి ఇప్పటి వరకు 4,715 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలియజేసారు.