Begin typing your search above and press return to search.
బీజేపీకి షాకిచ్చి.. మమతకు జై
By: Tupaki Desk | 8 Dec 2021 6:00 PM ISTవచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఇప్పటి నుంచే దేశంలో మొదలైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
అందులో గోవా కూడా ఒకటి. మోడీషా ద్వయాన్ని తట్టుకుని బెంగాల్‌లో మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన మమతా బెనర్జీ ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. గోవాలో బీజేపీ విజయాన్ని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలను ఆమె మొదలెట్టారు. ఓ వైపు బీజేపీ అగ్రనేతలు గోవాలో పర్యటించి అక్కడ పార్టీని బలోపేతం చేస్తుంటే మరోవైపు మమత అక్కడ ఆ పార్టీకి షాకిస్తున్నారు.
తాజాగా గోవాలో బీజేపీ మిత్రపక్షమైన మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎమ్‌జీపీ) దీదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంది. బీజేపీకి షాకిచ్చిన ఆ పార్టీ.. మమతకు జై కొట్టడం ఇప్పుడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఓ సారి గోవాలో పర్యటించిన మమతా బెనర్జీ.. త్వరలోనే మరోసారి అక్కడికి వెళ్లనున్నారు. బీజేపీకి దీర్ఘకాల మిత్రుడిగా ఉన్న ఎమ్‌జీపీ తనకు మద్దతు తెలపడంతో సీట్ల సర్దుబాటు విషయాన్ని ఆ పార్టీతో ఆమె చర్చిస్తారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లుయిజిన్హో ఫలేరియో, మహువా మొయిత్రా సమక్షంలో ఈ కూటమిపై ప్రకటన వెలువడింది.
ఫలేరియోను ఎమ్‌జీపీ పార్టీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్.. మహువా, ఫలేరియాలను గోవాలోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో కలిశారు. భవిష్యత్ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు కలిసి పని చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో బీజేపీకి తానే ప్రత్యామ్నాయమని పదే పదే చెప్తున్న దీదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని బీజేపీకి వ్యతిరేక కూటములను ఒక్కతాటిపైకి తెచ్చి దానికి సారథ్యం వహించి కాషాయ పార్టీని ఓడించాలన్నది దీదీ లక్ష్యం. మరి ఆ దిశగా ప్రయాణం చేస్తున్న ఆమె కల సాకారం అవుతుందో లేదో చూడాలి.