Begin typing your search above and press return to search.

38 ఏళ్లకే 20సార్లు ప్రెగ్నెన్నీ.. పిల్లలు ఎందరంటే?

By:  Tupaki Desk   |   10 Sep 2019 4:59 AM GMT
38 ఏళ్లకే 20సార్లు ప్రెగ్నెన్నీ.. పిల్లలు ఎందరంటే?
X
వినేందుకే విచిత్రంగా అనిపించే ఉదంతంగా దీన్ని చెప్పాలి. పిల్లలు లేరని కుమిలిపోయే వారు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. దీనికి భిన్నమైన ఉదంతంగా దీన్ని చెప్పాలి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన లంకాభాయ్ కరత్ ఉదంతం వింటే నోటి వెంట మాట రాదంతే.

పిల్లలు పుట్టలేదంటూ ఏడు పదుల వయసులో కుమిలిపోతూ.. ఆశ్చర్యకరంగా గర్భం దాల్చిన తెలుగు మహిళ మంగాయమ్మ ఉదంతం వైరల్ గా మారిన వేళ.. 38 ఏళ్ల వయసులో లంకాభాయ్ మరోలా వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆమె ప్రత్యేక ఏమంటే.. తాజాగా ఆమె గర్భం దాల్చింది. అందులో ఏముంది ప్రత్యేకత అని కొట్టి పారేయలేం. ఎందుకంటే.. అది ఆమె 20వ గర్భధారణ.

38 ఏళ్ల వయసులో ఆమె ఇరవయ్యోసారి ప్రెగ్నెన్సీకి గురి కావటం ఒక విశేషం అయితే.. ఇప్పటివరకూ ఆమె 16 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఆమెకు 11 మంది పిల్లలు ఉన్నారు. మరో మూడుసార్లు అబార్షన్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె విజయవంతంగా ఇరవయ్యోసారి గర్భం దాల్చారు. మరింత ఆసక్తికరమైన విశేషం ఏమంటే.. ఆమె డెలివరీలన్ని ఇంటి వద్దే జరగటం. అదే పనిగా గర్భం దాల్చటం ఆరోగ్యానికి హానికరంగా వైద్యులు చెబుతున్నారు. ఇన్నిసార్లు డెలివరీలకు సిద్ధమైన ఆమె ఓపికకు ముక్కున వేలేసుకుంటున్నారు ఆమె గురించి తెలిసినవారంతా.