Begin typing your search above and press return to search.

లవ్ చేయట్లేదని.. మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

By:  Tupaki Desk   |   4 Feb 2020 10:15 AM IST
లవ్ చేయట్లేదని.. మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
X
దారుణం చోటు చేసుకుంది. పెళ్లై.. ఏడు నెలల కొడుకు ఉన్నప్పటికీ.. తనను ప్రేమించాలంటూ మహిళా లెక్చరర్ వెంట పడటమే కాదు.. అతడి ప్రేమకు నో చెప్పిందన్న కోపంతో నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి తెలిసినంతనే ఒంట్లో రక్తం మరిగిపోవటం ఖాయం.

వార్థా జిల్లా నందోరి చైక్ లో వికాన్ అనే 27 ఏళ్ల యువకుడు ఉండేవాడు. దడోరా గ్రామానికి చెందిన అతగాడి ఊరికి చెందిన 26 ఏళ్ల అంకిత కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంటారు. ఒకే ఊరి వారు కావటంతో వారిద్దరికి పరిచయం ఉంది. పెళ్లై.. భార్య ఉన్నప్పటికి ప్రేమ అంటూ అంకిత వెంట పడేవాడు. ఆమె అతని ప్రవర్తన నచ్చక పక్కన పెట్టింది. దీంతో ఆమె మీద కోపం పెంచుకున్న వికాస్.. తాజాగా దారుణానికి పాల్పడ్డాడు.

ఆమె పని చేసే కాలేజీ దగ్గర కాపు కాచి.. ఆమె వచ్చినంతనే గొడవ పడ్డాడు. అంతేకాదు.. తన వెంట తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పంటించాడు. ఊహించని పరిణామంతో షాక్ తింది. అంతలోనే ఆమె ఒంటిని మంటలు అంటుకున్నాయి. వెంటనే తన టూవీలర్ మీద పారిపోయాడు. జరుగుతున్న దారుణాన్ని గుర్తించిన స్థానికులు మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు.

అప్పటికే ఆమె శరీరం బాగా కాలి పోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రి కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను నాగపూర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రేమ విఫలం కావటంతోనే ఇలాంటి పనికి వికాస్ పాల్పడి ఉంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లవ్ ఫెయిల్ అయి.. పెళ్లైన తర్వాత కూడా వెంట పడాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు. నిజంగా ప్రేమ అంటే.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి బాగుండాలని కోరుకోవాలే కానీ.. ఇలా ప్రాణాలు తీయటం కాదంటున్నారు. వికాస్ కారణంగానే అంకితకు పెళ్లైనప్పటికీ.. ఆమె వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనట్లుగా ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం సంచలనం గా మారింది.