Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రచారానికి దెబ్బేస్తున్న మహారాష్ట్ర

By:  Tupaki Desk   |   12 March 2016 6:16 PM GMT
కేసీఆర్ ప్రచారానికి దెబ్బేస్తున్న మహారాష్ట్ర
X
పక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజలు ఉండి మరీ.. చారిత్రక ఒప్పందం చేసుకున్నట్లుగా కలర్ ఇవ్వటం.. భారీ ప్రచారం చేసుకోవటం.. తాము పెద్ద విజయాన్ని సాధించినట్లుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న తెలంగాణ సర్కారుకు మహారాష్ట్ర సర్కారు షాకిచ్చింది. 300 ఏళ్లుగా నలుగుతున్న వివాదాలకు మంగళం పలుకుతూ.. చారిత్రక ఒప్పందాన్ని కేసీఆర్ చేసుకోవటంలో ఘన విజయం సాధించినట్లు చెబుతున్న తీరుకు తాజాగా మహారాష్ట్ర మంత్రి ఒకరు చేసిన కౌంటర్ వ్యాఖ్య టీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం ఖాయం.

మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని.. ప్రాజెక్టుల నరిమాణమే తరువాయిగా పేర్కొంటున్న తెలంగాణ సర్కారు తీరుకు భిన్నంగా.. మహారాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి గిరిష్ మహాజన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంతో తమకు ఎలాంటి ఒప్పందం కుదర్లేదని..కాకుంటే భవిష్యత్తులో ప్రాజెక్టులకు సంబంధించి వివాదాలు.. నిర్ణయాలు తీసుకోవటానికి అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలన్నదే ప్రస్తుతానికి కుదిరిన ఒప్పందమని తేల్చిచెబుతున్నారు.

తెలంగాణ సర్కారుతో అన్నిప్రాజెక్టులపై అవగాహన వచ్చాకే.. అవగాహన చేసుకుంటామని ఆయన చెప్పటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం మొదట ఏపీతో జలవనరులపై రాజీ కుదుర్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. మహారాష్ట్రతో తమకు కుదిరిన ఒప్పందం గురించి మా గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావులు మహారాష్ట్ర మంత్రి మాటలకు ఎలా రియాక్ట్ అవుతారో..?