Begin typing your search above and press return to search.

సీఎం గారి భార్యామ‌ణి బైక్ రైడ్ చూశారా?

By:  Tupaki Desk   |   3 Aug 2019 3:40 PM GMT
సీఎం గారి భార్యామ‌ణి బైక్ రైడ్ చూశారా?
X
సీఎం భార్య అంటే ఎలా ఉండాలి? ఎంతో ప‌ద్ధ‌తిగా ఒద్దిక‌గా ఉంటే స‌రిపోతుందా? కాస్తంత గ‌ట్స్ కూడా ఉండాలి. ఈ విష‌యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విష్ భార్యామ‌ణి అమృత ఫడ్న‌విస్ గురించి ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ముఖ్యంగా త‌న‌లోని బ‌హుముఖ పార్శ్యాల (మ‌ల్టీ ట్యాలెంట్) గురించి.. సామాజిక సేవా ధృక్ప‌థం గురించి నిరంతరం అభిమానులు ముచ్చ‌టించుకుంటారు. అమృత గొప్ప గాయ‌ని.. బైక్ రైడ‌ర్.. సామాజిక క‌ర్త‌.. క‌ళాకారిణి. గృహిణిగా ఓ వైపు బాధ్య‌త‌లు నెర‌వేరుస్తూనే ఎంతో యాక్టివ్ గా సోష‌ల్ వ‌ర్క్ లోనూ బిజీగా ఉంటారు.

వీలున్న‌ప్పుడ‌ల్లా ముంబై వీధుల్లోకి అలా బైక్ రైడ్ కి కూడా వెళుతుంటారు. ఒక సామాన్య యువ‌తిలా స్కూటీల‌పైనా.. బైక్ పైనా రైడ్ కి వెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఇక బైక్ చేత‌ప‌డితే చ‌క‌చ‌కా గేర్లు మార్చేస్తూ స్పీడ్ ని మెయింటెయిన్ చేస్తార‌ట‌. ఇన్ని క్వాలిటీస్ సీఎం భార్య‌లో ఉండ‌డంతో అనునిత్యం మీడియాకి అది ఆస‌క్తిక‌ర టాపిక్ గా మారింది. ఇక వీట‌న్నిటినీ మించి ఒక అందాల క‌థానాయిక ఫీచ‌ర్స్ తో సీఎంగారి భార్యామ‌ణి లోని గ్లామ‌ర్ యాంగిల్ యువ‌త‌రంలో హాట్ టాపిక్. అన్న‌ట్టు అమృత ఫ‌డ్న‌విస్ కి దివిజ ఫ‌డ్న‌విస్ అనే ఒక కూతురు కూడా ఉంది.