Begin typing your search above and press return to search.

మహిళలకు తీపి కబురు కోసం రూ.వెయ్యి కోట్ల భారానికి సిద్ధమైన మహా సర్కార్

By:  Tupaki Desk   |   9 March 2021 3:00 AM GMT
మహిళలకు తీపి కబురు కోసం రూ.వెయ్యి కోట్ల భారానికి సిద్ధమైన మహా సర్కార్
X
ఇటీవల కాలంలో మరెప్పుడూ లేనంత భారీగా ఈ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత ఒక దినోత్సవం కోసం ఇంత భారీగా వేడుకలు.. కార్యక్రమాలు జరిగింది ఇప్పుడే కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది.

మహిళల పేరుతో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఒకశాతం స్టాంప్ డ్యూటీని తగ్గించినట్లుగా వెల్లడించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆర్థికమంత్రి.. డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. తాజాగా జరిగిన మహా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ ఈ తీపికబురు వెల్లడించారు.

మహారాష్ట్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో.. రాష్ట్ర ఖజానాపై రూ.వెయ్యి కోట్ల భారం పడనుంది. అయినప్పటికి తమ ప్రభుత్వం ఆ విషయాన్ని ఆలోచించటం లేదని.. మహిళలకు పెద్ద పీట వేయటమే తమ సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. అందులో భాగంగా తాజా నిర్ణయం కూడా ఉందన్నారు.