Begin typing your search above and press return to search.

బావిలో పడిన బస్సు... 26 మంది దుర్మరణం

By:  Tupaki Desk   |   29 Jan 2020 3:16 PM IST
బావిలో పడిన బస్సు... 26 మంది దుర్మరణం
X
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఆటోను ఢీకొనడంతో మంగళవారం ఆ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదంలో ఏడుగురు మాత్రమే మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో కనీసం 26 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

అతివేగం కారణం గానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు నలిగిపోయారు. నీటి లో మునిగి ఊపిరాడక చాలా మంది చని పోయారు. బావి లోతు 70 అడుగులు ఉండడం తో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.