Begin typing your search above and press return to search.

ఒక్క‌డి కోసం.. పోలింగ్ బూత్‌.. 8 మంది అధికారులు.. ఇంకా.. ఇంకా!

By:  Tupaki Desk   |   6 Nov 2022 1:30 AM GMT
ఒక్క‌డి కోసం.. పోలింగ్ బూత్‌.. 8 మంది అధికారులు.. ఇంకా.. ఇంకా!
X
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఫలితం తారుమారైన ఘటనలు ఎన్నో. అందుకే.. ఒకే ఒక్క ఓటరు ఉన్న చోట కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. ఆయన కోసం 8 మంది అధికారులు, భద్రతా సిబ్బందిని మారుమూల ప్రాంతానికి పంపుతోంది.

సాధారణంగా పోలింగ్ బూత్ దగ్గర ఉదయం నుంచే బారులు తీరే జనాలను చూసుంటాం. ఆ క్యూను చూసి విసుగు చెంది వెనుతిరిగే ఓటర్లనూ చూసుంటాం. కానీ గుజరాత్లోని గిర్ సోమ్నాథ్ ప్రాంతంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ పోలింగ్ కేంద్రం దర్శనమిస్తుంది.

అక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య చెప్తే షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ ఓటు వేసేందుకు వచ్చేది ఒక వ్యక్తి మాత్రమే. ఆ ఒక్కరి కోసమే ప్రత్యేకంగా పోలింగ్ బూత్ను ఏర్పాటు చేస్తారు.

గుజరాత్లోని ఉనా నియోజకవర్గం బనేజ్ ప్రాంతానికి చెందిన మహంత్ హరిదాస్ బాపు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ ఆ పోలింగ్ స్టేషన్కు వస్తారు. ఆ ప్రాంతంలో నివసించేది ఆయన ఒక్కరే అయినందున ఆయన కోసమని ఈసీ అక్కడ ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎనిమిది మంది అధికారులు, భద్రతా సిబ్బందిని పంపుతోంది.

ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్దాస్ బాపు అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేది ఈసీ. 2019లో ఆయన మరణించిన తర్వాత ఆ పోలింగ్ బూత్ను మూసివేయాలనుకున్నారు అధికారులు.

అయితే ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్ మహరాజ్ రావడం వల్ల తిరిగి ఆ పోలింగ్ బూత్ను ప్రారంభించారు. తన కోసం పోలింగ్ స్టేషన్ను పునఃప్రారంభించినందుకు హరిదాస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పోలింగ్ బూతు నిర్వ‌హ‌ణ కోసం అక్ష‌రాలా ల‌క్ష రూపాయ‌ల‌ను అధికారులు ఖ‌ర్చు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.